న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు హెచ్చరికలు జారీ చేసిన ధావన్

Asia Cup 2018 : Shikhar Dhawan Gives Instructions To Team India
Asia Cup Final: Shikhar Dhawan warns teammates, says can’t take Pakistan-slayer Bangladesh lightly

న్యూ ఢిల్లీ: ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా ఆడుతోన్న ప్రతిష్టాత్మక సిరీస్ ఆసియా కప్. లీగ్ దశను ముగించుకుని సూపర్ 4దశ దాటి ఫైనల్‌లో అడుగుపెట్టింది టీమిండియా. ఈ క్రమంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య శుక్రవారం జరగనున్న నేపథ్యంలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తోటి ఆటగాళ్లందరికీ కొన్ని ‌హెచ్చరికలు జారీ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో టైటిల్‌ కోసం జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్‌ జట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయొద్దని సూచించాడు.

1
44058
పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో విజయం

పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో విజయం

బుధవారం జరిగిన సూపర్‌ ఫోర్‌ క్లాష్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘ఈ టోర్నమెంట్‌లో అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఫైనల్స్‌ పోరు భారత్‌-పాక్‌ మధ్య ఉంటుందని తొలుత అంతా భావించారు. కానీ సరైన ఆట తీరుతో బంగ్లాదేశ్‌ పాక్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ జట్టును తేలిగ్గా అంచనా వేయలేం. దాని కన్నా బలమైన జట్టు అయిన పాక్‌నే అది మట్టి కరిపించింది.'

ఫైనల్‌కు చేరిన భారత్, ఓపనెర్లకు ట్వీట్ల శుభాకాంక్షలు

 ఒక్కోసారి అంచనాలు తప్పొచ్చు.

ఒక్కోసారి అంచనాలు తప్పొచ్చు.

'ఊహిస్తున్నదానికి వాళ్లు మైదానంలో ఆడుతున్న దానికీ చాలా తేడా కనిపిస్తోంది. తమది చాలా బలమైన జట్టు అని బంగ్లాదేశ్‌ జట్టు భావిస్తోంది. ఆ జట్టులో ఇప్పుడు మంచి ఆటగాళ్లు ఉన్నారు. బలమైన జట్లతో ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడి మధ్య వ్యూహాత్మకంగా ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. బంగ్లా జట్టు కేవలం 18 ఏళ్ల నుంచే క్రికెట్‌ ఆడుతున్నా.ఫైనల్స్‌లో గెలిచేందుకు దానికి ఇంకా సమయం అవసరం. ఒక్కోసారి మన అంచనాలు తప్పొచ్చు. ' అని శిఖర్‌ ధావన్‌ తోటి ఆటగాళ్లకు సూచించాడు.

వైస్ కెప్టెన్‌గా ఉండటాన్ని ఎంజాయ్

వైస్ కెప్టెన్‌గా ఉండటాన్ని ఎంజాయ్

ఏదేమైనా శుక్రవారం జరిగే మ్యాచ్‌ కచ్చితంగా గెలిచి తీరాలి. భవిష్యత్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ఊహించని రీతిలో విజయాలు నమోదు చేసే అవకాశముందంటూ అభిప్రాయపడ్డాడు. ఇంకా 'జట్టు పోరాటంలో నాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అంతా మా కెప్టెనే చూసుకుంటాడని' చెప్తూ నవ్వించాడు. తాను వైస్ కెప్టెన్‌గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు.

తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ విజయపథంలో

తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ విజయపథంలో

బ్యాటింగ్‌లో దూకుడు ఉన్నంత కాలం ఆ పదవి అలానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా వైస్ కెప్టెన్ అయినంత మాత్రాన వేరేలా ప్రవర్తించి గుర్తింపును మార్చుకోలేనంటూ వివరించాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకపోయినప్పటికీ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోకుండా దూసుకెళ్తున్న జట్టు.. ఆఖరి మ్యాచ్‌ను టైగా ముగించింది.

Story first published: Friday, September 28, 2018, 11:57 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X