న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్‌కు చేరిన భారత్, ఓపనెర్లకు ట్వీట్ల శుభాకాంక్షలు

Twitterati Rejoice After India Thrash Pakistan in Much-Awaited Asia Cup Clash

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా దుబాయి వేదికగా భారత్‌-పాక్‌‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భాగంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రితం మ్యాచ్‌కంటే బ్యాటింగ్‌లో మెరుగైనా.. భారత బౌలర్ల ధాటికి పాక్‌ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. సూపర్‌-4లో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 237పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ శతకాలు బాది జట్టుకు విజయాన్ని అందించారు. ధావన్ రనౌట్‌ అనంతరం అంబటి రాయుడు క్రీజులోకి వచ్చి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై రెండోసారి టీమిండియా విజయం సాధించడంతో అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సచిన్‌, కోహ్లీలు సైతం టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.

టీమిండియా ఆడిన విధానం!

టీమిండియా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. మీరు ఆడిన విధానం చూడటానికి ఎంతబాగుందో!. ఇది మనకు గొప్ప విజయం. మీ ప్రదర్శన అద్భుతం'.

రికార్డు: అత్యంత వేగంగా 300 సిక్సులు బాదిన రెండో ఆటగాడిగా రోహిత్

ఇద్దరికీ శుభాకాంక్షలు... ఇది క్లీన్‌ హిట్టింగ్‌.

‘శతక వీరులు రోహిత్‌ శర్మ, శిఖర్‌లకు శుభాకాంక్షలు. ఇది క్లీన్‌ హిట్టింగ్‌. మీరిద్దరూ క్రీజులో ఉంటే చూడటానికి ఎప్పుడూ బావుంటుంది. ఆల్‌ ది బెస్ట్‌ గయ్స్‌'.

విరుచుకుపడిన విధానం అద్భుతం:

‘ రోహిత్‌, ధావన్ క్రీజులో విరుచుకుపడిన విధానం అద్భుతం. మీ ఇద్దరి కెప్టెన్సీలోని టీమిండియాకు శుభాకాంక్షలు. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ చూడటానికి అద్భుతంగా అనిపించింది'

సెంచరీలతో ఆటను హోరెత్తించి:

‘హ్యట్సాఫ్‌ రోహిత్‌, శిఖర్‌. సెంచరీలతో ఆటను హోరెత్తించారు. ఇండియా-పాక్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది'.

దూకుడు కొనసాగించాలి’.

‘గత మ్యాచ్‌ కంటే ఈ మ్యాచ్‌ అద్భుతం. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూడటానికి ఎంతో బావుంది. ఈ టోర్నీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఇదే దూకుడు కొనసాగించాలి'.

బ్యాట్స్‌మెన్లు రోహిత్‌, ధావన్ సూపర్ విజయం

‘మరో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియాకు శుభాకాంక్షలు. 237పరుగులకే పాక్‌ను పరిమితం చేయడంలో బౌలర్లు విజయం సాధించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో బ్యాట్స్‌మెన్లు రోహిత్‌, ధావన్ సూపర్ విజయం సాధించారు. కంగ్రాట్స్‌ టీమిండియా'.

రోహిత్‌, శిఖర్‌ సింపుల్‌గా కనిపించినా..

‘భారత్‌కిది అద్భుతమైన విజయం. రోహిత్‌, శిఖర్‌ చూడటానికి సింపుల్‌గా కనిపించినా ఆటలో అద్భుతంగా రాణించారు. ఇండియా-పాక్‌ మ్యాచ్‌లో బూమ్రా ఔట్‌ స్టాండింగ్‌ ప్రదర్శన కనబరిచాడు'.

Story first published: Monday, September 24, 2018, 15:06 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X