న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ పేసర్ ఆమిర్‌ను ఎదుర్కొనేందుకు లంక బౌలర్ నువాన్‌తో టీమిండియా ప్రాక్టీస్

Asia Cup 2018: India, Pakistan Players Practice Sessions
Asia Cup: BCCI sends five India A bowlers to UAE for quality net sessions

హైదరాబాద్: యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐదుగురు బౌలర్లను ప్రాక్టీస్ కోసం దుబాయ్ పంపింది. ముగ్గురు పేసర్లు ఆవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), ప్రసిద్ధ్ కృష్ణ (కర్ణాటక), సిద్ధార్థ్ కౌల్ (పంజాబ్), స్పిన్నర్లు షహబాజ్ నదీమ్, మయాంక్ మార్కండే ఉన్నారు.

ఆసియా కప్‌లో నమోదైన రికార్డులు: తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలుఆసియా కప్‌లో నమోదైన రికార్డులు: తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు

ఆవేశ్ ఖాన్ మినహా మిగతా నలుగురు ఇటీవల ముగిసిన చతుర్ముఖ సిరీస్‌లో భారత్-ఏ, బీ జట్ల తరఫున ఆడారు. ఇక, సిద్ధార్థ్ కౌల్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో మూడు రోజుల్లో వీళ్లు నెట్ సెషన్‌లో టీమిండియాకు బౌలింగ్ వేయనున్నారు.

విజయ్ హజారే ట్రోఫీ సమయానికి భారత్‌కు

విజయ్ హజారే ట్రోఫీ సమయానికి భారత్‌కు

సెప్టెంబర్ 19 నుంచి మొదలయ్యే విజయ్ హజారే ట్రోఫీ సమయానికి వీళ్లు భారత్‌కు తిరిగొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్‌ను సమర్థంగా ఎదుర్కొవాలనే ఉద్దేశంతో బీసీసీఐ శ్రీలంకకు చెందిన నువాన్ సెనెవిరత్నేతో భారత జట్టులోని ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఏర్పాటు చేసింది. నువాన్ త్రోడౌన్స్‌లో బ్యాట్స్‌మన్ ప్రాక్టీస్ చేయనున్నారు.

ధోనితో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కరచాలనం

మరోవైపు శుక్రవారం జరిగిన తొలి నెట్ సెషన్‌లో 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీప‌ర్ మహేంద్ర సింగ్ ధోనితో పాకిస్థాన్ వెటరన్ క్రికెట‌ర్ షోయబ్ మాలిక్ కరచాలనం చేశాడు. అంతేకాదు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఆరు జట్లు

ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఆరు జట్లు

శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.

హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు అంతర్జాతీయ వన్డే హోదా

హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు అంతర్జాతీయ వన్డే హోదా

హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో క్వాలిఫయిర్‌తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్

50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్

గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి.

Story first published: Saturday, September 15, 2018, 10:58 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X