న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్

Rahul Dravid Advises Team India To Focus On Afghanistan Team Also
Asia Cup 2018: Rahul Dravid warns India to be wary of Afghanistan in their title defence campaign

దుబాయి: ఆసియా కప్ టోర్నీలో దూకుడు మీదున్న టీమిండియాకు భారత జట్టు దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ సూచనలిస్తున్నాడు. ఆసియా కప్‌ టైటిల్‌ని నిలబెట్టుకోవాలంటే దాయాది పాకిస్థాన్‌నే కాదు అఫ్గానిస్థాన్ టీమ్‌ను కూడా ఓడించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రాహుల్ ద్రవిడ్ సూచించాడు. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన భారత్ జట్టు వరుసగా హాంకాంగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై ఘన విజయాలతో మంచి జోరుమీదుంది.

<strong>ధోనీ రివ్యూ సిస్టమ్ మళ్లీ వర్కౌట్ అయింది!!</strong>ధోనీ రివ్యూ సిస్టమ్ మళ్లీ వర్కౌట్ అయింది!!

ఆదివారం సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ గెలిచి టోర్నీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ జట్టు ఫైనల్‌కి చేరి.. ఆ తర్వాత టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే మంగళవారం అఫ్గానిస్థాన్ టీమ్‌ను కూడా ఓడించాలని ద్రవిడ్ గుర్తుచేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుని అఫ్గానిస్థాన్‌ దాదాపు ఓడించినంత పనిచేసింది.

ఆఖరి ఓవర్‌లో షోయబ్ మాలిక్ వరుసగా 6, 4 బాదడంతో 3 వికెట్ల తేడాతో గెలిచి పాక్ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యలోనే రాహుల్ ద్రవిడ్ పైసూచన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ కొద్దిగా స్పీడు పెంచి 237 పరుగులు చేశారు. అయినా పాక్ బౌలర్ల వైఫల్యంతో ఓపెనర్లే సగం స్కోరును బాదేయడంతో టీమిండియా పాక్‌ను మరో సారి అలవోకగా ఓడించేసింది.

'ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌ మెరుగ్గా ఆడుతోంది. కానీ.. భారత జట్టు అఫ్గానిస్థాన్‌ని పట్టించుకోకుండా కేవలం పాకిస్థాన్‌ని ఓడించడంపైనే దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ధోరణి టోర్నీలో కొనసాగితే సమస్యలు ఎదురవ్వొచ్చు. అలా అని.. భారత్ జట్టు మెరుగ్గా ఆడట్లేదని నేను చెప్పట్లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కొద్దిరోజుల నుంచి చాలా బాగా ఆడుతోంది. కానీ.. పాక్‌తో పాటు మిగిలిన టీమ్స్‌పై కూడా కొంచెం దృష్టిసారిస్తే మంచిది' అని రాహుల్ ద్రవిడ్ సునిశితంగా హెచ్చరించాడు.

Story first published: Monday, September 24, 2018, 11:02 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X