న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌కు జట్టు ఎంపిక: కోహ్లీకి విశ్రాంతి... రాయుడు, జాదవ్‌లకు చోటు

By Nageshwara Rao
Asia Cup 2018 : Indian Team Squad With 16 Members Was Selected For Asia Cup
Kohli

హైదరాబాద్: ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ఆసియా కప్‌లో ఆడే భారత జట్టుని ప్రకటించింది. వర్క్‌లోడ్ కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీనే మోయడం.. రెండో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడటం సెలక్టర్లను కలవరపెడుతోంది. ఇక, ఆసియా కప్ అనంతరం టీమిండియా రాబోయే మూడు నెలల్లో మొత్తం ఆరు టెస్టు మ్యాచ్‌లు(వెస్టిండిస్‌తో రెండు, ఆస్ట్రేలియాతో నాలుగు) ఆడనుంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడమే మేలు అని సెలక్టర్లు భావించారు. దీంతో టీమిండియా కెప్టెన్‌గా జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్‌ శర్మ నిర్వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌లో మిడిలార్డర్‌లో ప్రయోగాలు చేసేందుకు సెలక్టర్లు మొగ్గు చూపారు.

ఇందులో భాగంగా ఇటీవల భారత్‌-బి, భారత్‌-ఏ జట్ల తరపున రాణించిన మనీష్‌ పాండే, అంబటి రాయుడులకు చోటు కల్పించారు. గాయం నుంచి కోలుకున్న కేదార్ జాదవ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌‌తో పాటు బుమ్రా, పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్, అక్షర పటేల్, శార్దూల్ ఠాకూర్‌లు చోటు దక్కించుకున్నారు.

"ఆటగాళ్లపై పడుతోన్న వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చాం. గత కొద్ది కాలంగా అతడు విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. కోహ్లీ విలువైన ఆటగాడు. భవిష్యత్తు టోర్నీలు కూడా దృస్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి కల్పించాం" అని సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.

Khallel

ధోనికి బ్యాకప్‌గా వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కే ఓటేశారు సెలక్టర్లు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన ఖలీల్‌ అహ్మద్‌ సెలక్టర్ల నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఖలీల్‌ రాజస్థాన్‌కు చెందిన వాడు.సెప్టెంబరు 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆరంభమయ్యే ఆసియా కప్‌లో భారత్ సహా ఆరు జట్లు పోటీపడనున్నాయి.

ప్రతీ రెండేళ్లకోసారి ఆసియా దేశాల మధ్య జరిగే అతిపెద్ద క్రికెట్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ని సెప్టెంబర్ 18న ఆడనుంది. ఈ టోర్నీలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగనుంది.

ఆసియా కప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్( వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, అంబటి రాయుడు, ధోనీ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్

Story first published: Saturday, September 1, 2018, 14:23 [IST]
Other articles published on Sep 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X