న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

700 మ్యాచ్‌లకు 7సార్లు గెలిచిన టీమిండియా!!

Asia Cup 2018: India scale Mount 700 after thrilling win over Bangladesh in final

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఇంటర్నేషనల్‌ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ఐదుకంటే ఎక్కువ టోర్నీలు(8) గెలిచిన దేశంగా భారత్‌ తొలిస్థానంలో నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా(7) మీద ఉండగా శుక్రవారం టీమిండియా ఆసియాకప్‌ సొంతం చేసుకోవడంతో ఈ అరుదైన రికార్డు సాధించింది.

ఇక అత్యధిక సార్లు ఆసియాకప్‌ను సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్‌ నిలిచింది. 1984 నుంచి భారత్‌ ఏడు సార్లు ఆసియాకప్‌ను ముద్దాడింది. ఆ తర్వాత ఎక్కువ సార్లు(5) శ్రీలంక గెలుచుకుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎక్కువ సార్లు గెలిచిన మూడో దేశంగా భారత్‌ నిలిచింది.

ఇంతకు ముందు 699 మ్యాచ్‌లతో మూడో స్థానంలోనే ఉండగా శుక్రవారం ఆసియాకప్‌ను గెలవడంతో 700 మ్యాచ్‌లు గెలిచిన దేశంగా తన స్థానాన్ని పదిల పరుచుకుంది. ఇక భారత్‌ కంటే ముందు ఆస్ట్రేలియా(995), ఇంగ్లాండ్‌(767) ముందంజలో ఉన్నాయి.

వికెట్ల వెనకాల నిల్చుని బ్యాట్స్‌మన్‌ ఆలోచనలను పసిగట్టి చురుకుగా స్పందించడంలో ధోనీకి సాటి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. తన టైమింగ్‌తో ఎంతోమంది ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపించిన ధోనీ అరుదైన ఘనత సాధించాడు. వికెట్‌ కీపర్‌గా 800 మంది బ్యాట్స్‌మెన్ల ఔట్లలో పాలుపంచుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Story first published: Sunday, September 30, 2018, 10:04 [IST]
Other articles published on Sep 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X