న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లాంఛనమైన అఫ్గాన్ మ్యాచ్‌కు భారత్ సిద్ధం

Asia Cup 2018: India Look To Flex Bench Strength Against Afghanistan With Spot In Final
Asia Cup 2018: India look to flex bench strength against Afghanistan with spot in final assured

న్యూఢిల్లీ: వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్‌ సూపర్‌-4 లో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సంచలన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న అఫ్ఘానిస్థాన్‌తో మంగళవారం తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా భారత జట్టు అఫ్ఘాన్‌ను తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం రావచ్చు. ఎందుకంటే ఆ జట్టు లీగ్‌ దశను భారత్‌తో సమానంగా రెండు విజయాలతో ముగించింది.

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అయినా.. సూపర్‌-4 తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు పోరాడిన అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే చేదు అనుభవం తప్పదు. మరోవైపు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన భారత్‌.. హ్యాట్రిక్‌ గెలుపుపై కన్నేసింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటిదాకా మిడిలార్డర్‌కు ఎలాంటి సవాల్‌ ఎదురు కాలేదు.

మిడిలార్డర్‌తో సత్తా చాటాలని

మిడిలార్డర్‌తో సత్తా చాటాలని

అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ రాణించాలని కెప్టెన్‌ రోహిత్‌శర్మ కోరుకుంటున్నాడు. రషీద్‌ఖాన్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌ను ఎదుర్కొని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలవాలనేది అతని కోరిక. విరాట్‌ కోహ్లి లేని నేపథ్యంలో ధావన్‌ (327), రోహిత్‌ (269) మాత్రమే ఇప్పటిదాకా బ్యాటింగ్‌ భారాన్ని పంచుకున్నారు. మూడో స్థానంలో వస్తున్న అంబటి రాయుడు (116) ఫర్వాలేదనిపించాడు. కేదార్‌ జాదవ్‌, ధోని, దినేశ్‌ కార్తీక్‌లకు ఇప్పటిదాకా బ్యాటింగ్‌ అవకాశాలు తక్కువగా వచ్చాయి.

 ధోనీ ఈ మ్యాచ్‌లోనైనా

ధోనీ ఈ మ్యాచ్‌లోనైనా

కేదార్‌ 27 బంతులే ఎదుర్కోగా.. ధోని 40 బంతులే ఆడాడు. మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్న మహి.. అఫ్గాన్‌పైనైనా జూలు విదుల్చుతాడేమో చూడాలి. ఈ టోర్నీలో ఇప్పటిదాకా అవకాశం దక్కని కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండేలకు కూడా ఈ మ్యాచ్‌లో చోటు కల్పించే అవకాశాలున్నాయి. ధావన్‌ స్థానంలో రాహుల్‌.. రాయుడు స్థానంలో పాండే జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

అఫ్గాన్‌పై ప్రతాపం చూపాలని బౌలర్లు

అఫ్గాన్‌పై ప్రతాపం చూపాలని బౌలర్లు

బౌలింగ్‌లో భారత్‌కు తిరుగేలేదని చెప్పాలి. పేసర్లు బుమ్రా (7 వికెట్లు), భువనేశ్వర్‌ కుమార్‌ (6 వికెట్లు)లతో పాటు స్పిన్నర్లు చాహల్‌ (5 వికెట్లు), కుల్‌దీప్‌ యాదవ్‌ (5 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా, భువి.. ఆరంభ, స్లాగ్‌ ఓవర్లలో అదరగొడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో వీళ్లిద్దరి బౌలింగే ఇందుకు ఉదాహరణ.

చివరి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు

చివరి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు

ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని వీరికి విశ్రాంతినిచ్చి రిజర్వ్‌ బెంచ్‌ మీదున్న దీపక్‌ చాహర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌లకు చివరి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు లేకపోలేదు. అరంగేట్రంలో ఆకట్టుకున్న ఖలీల్‌ అహ్మద్‌ కూడా అఫ్గాన్‌తో మ్యాచ్‌ ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు భారత్‌కు షాకిచ్చి ఈ టోర్నీని గొప్పగా ముగించాలని అఫ్గాన్‌ పట్టుదలతో ఉంది.

 జట్ల అంచనా, పిచ్ స్వభావం:

జట్ల అంచనా, పిచ్ స్వభావం:

భారత్: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాయుడు, దినేశ్‌ కార్తీక్‌/రాహుల్‌, ధోనీ, కేదార్‌ జాదవ్‌, జడేజా, కుల్దీప్‌, భువ నేశ్వర్‌/ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా/దీపక్‌ చా హర్‌, చాహల్‌.

అఫ్ఘానిస్థాన్‌: మహ్మద్‌ షెహజాద్‌, ఇషానుల్లా, రహమత్‌ షా, హస్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్ఘన్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ నబీ, సమీయుల్లా షన్వరీ, గుల్బదిన్‌ నయీబ్‌, రషీద్‌ ఖాన్‌, అఫ్తాబ్‌ ఆలమ్‌, ముజీబుర్‌ రహమాన్‌.

పిచ్‌: స్పిన్నర్లకు అనుకూలించే అవకాశ ముం ది. బ్యాట్స్‌మెన్‌ కూడా భా రీగా పరుగులు సాధించవచ్చు.

Story first published: Tuesday, September 25, 2018, 10:14 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X