న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌తో పోరాడేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం: రోహిత్

Asia Cup 2018: Excited Rohit Sharma Looking Forward To Pakistan Clash

హైదరాబాద్: ఆరు దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీ వచ్చే వరల్డ్ కప్‌లో భారత్ 'పెర్ఫెక్ట్ కాంబినేషన్'కు ఉపకరిస్తుందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. వన్డే మ్యాచ్‌లకు సంబంధించి భారత్ ఇప్పటికీ సరైన మిడిలార్డర్‌ను సెట్ చేసుకోలేక ఇబ్బందిపడుతోంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్ కప్‌కు బలమైన జట్టు నిర్మాణానికి ఆసియా కప్ టోర్నీ ఉపకరిస్తుందా.. అనే ఒకవిధంగా అలా అనుకోవచ్చు.

 వరల్డ్ కప్ టీం'ను సెట్ చేసుకునే అవకాశం:

వరల్డ్ కప్ టీం'ను సెట్ చేసుకునే అవకాశం:

ఎవ్వరైనా బలమైన జట్టుతోనే ప్రపంచ కప్ టోర్నీకి వెళ్లాలనుకుంటారు. మీరన్నట్టు ఆసియా కప్‌లో ఆడుతున్న జట్లుకు ‘వరల్డ్ కప్ టీం'ను సెట్ చేసుకునే అవకాశం లభిస్తున్నట్టే'నని అన్నాడు. ‘ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈలోగా ఎన్నో మ్యాచ్‌లు జరుగుతాయి. చాలామంది ఆటగాళ్లకు అవకాశాలు రావొచ్చు. వచ్చిన అవకాశాన్ని ఎందరో సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పటికి ప్రపంచ కప్ జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం' అన్నాడు.

పాక్ క్రికెట్‌ను తక్కువ అంచనా వేయలేం

పాక్ క్రికెట్‌ను తక్కువ అంచనా వేయలేం

ఆసియా కప్‌లో ఆసక్తి రేకెత్తిస్తోన్న భారత్ -పాక్ పోరుపై వ్యాఖ్యానిస్తూ ‘పాక్ క్రికెట్‌ను తక్కువ అంచనా వేయలేమన్న విషయాన్ని వాళ్ల గతం చూసి చెప్పొచ్చు. ఇప్పుడు మేంమాత్రం వాళ్లతో పోరాటంవైపే చూస్తున్నాం' అన్నాడు.

 రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా

రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా

రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా మూడు వన్లేల్లో రెండు, తొమ్మిది టీ20ల్లో ఎనిమిది మ్యాచ్‌లు గెలుపొందింది. వన్డేల్లో మరోసారి డబుల్‌ సెంచరీ, టీ20లో టీమిండియా తరుపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించింది కెప్టెన్‌గా ఉన్నప్పుడే. దీంతో రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ నెగ్గుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 2019 ప్రపంచకప్‌ దృష్ట్యా సెలక్టర్లు ఆటగాళ్లను ఈ టోర్నీలో పరీక్షించనున్నారు.

 ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలనే

ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలనే

కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో మిడిలార్డర్ బలాన్ని అంచనావేయాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే సామర్థ్యంపై ఒక అంచనాకు రానుంది. ఇక గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌లు ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. సీనియర్‌ ఆటగాడు మాజీ కెప్టెన్‌ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ ఈ టోర్నీ ద్వారా స్పష్టమవుతుంది.

Story first published: Sunday, September 16, 2018, 12:14 [IST]
Other articles published on Sep 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X