న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో మైలురాయి: జ‌హీర్‌ఖాన్‌ రికార్డుని బద్దలు కొట్టిన అశ్విన్‌

By Nageshwara Rao
Ashwin Now has Zaheer Khan in his Shadow, Becomes Fourth Highest Wicket-taker in Tests for India

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు.

తన తొలి ఓవర్‌లోనే ఆప్ఘనిస్థాన్ జట్టు కెప్టెన్ అస్ఘర్ స్టానిక్‌‌జాయ్‌ను ఔట్ చేసి టెస్టు కెరీర్‌లో 312వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీమిండియా మాజీ పేసర్ జహీర్‌ ఖాన్ రికార్డును అశ్విన్ అధిగమించాడు. అతి తక్కువ కాలంలోనే అశ్విన్ ఈ ఘనత సాధించాడు.

భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు:
* అనిల్ కుంబ్లే- 619 వికెట్లు
* కపిల్ దేవ్ - 434 వికెట్లు
* హర్భజన్‌సింగ్- 417 వికెట్లు
* అశ్విన్-312 వికెట్లు
* జహీర్‌ఖాన్-311 వికెట్లు

బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు ఆప్ఘనిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్లలో ఇన్నింగ్స్ లో మహమ్మద్‌ నబి చేసిన 24 పరుగులే టాప్‌స్కోర్‌ కావడం గమనార్హం.

మహమ్మద్‌ షాహ్‌జాద్‌(14), రహమత్‌ షా(14), షాహిది(11), అస్గర్‌(11), ముజీబ్‌ రహమాన్‌(15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. దీంతో ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులు వెనుకబడి ఫాలోఆన్‌లో పడింది. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌(4/27) తన స్పిన్‌ మాయాజాలంతో ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించగా... ఇషాంత్ శర్మ, జడేజా తలో 2, యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 347/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ప్రారంభంలోనే అశ్విన్ వికెట్ కోల్పోయింది. ఫలితంగా 369 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా తన కెరీర్‌లో మూడో హఫ్ సెంచరీని నమోదు చేయగా, అతడికి జడేజా తోడు జడేజా రాణించడంతో వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ఉమేష్ యాదవ్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

Story first published: Friday, June 15, 2018, 15:28 [IST]
Other articles published on Jun 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X