న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో అగ‌ర్ హ్యాట్రిక్‌.. దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం!!

Ashton Agar thrilled with hat-trick, Australia beat South Africa


జొహనెస్‌బర్గ్:
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో ద‌క్షిణాఫ్రికా చిత్తుచిత్తుగా ఓడింది. జొహ‌న్న‌స్‌బ‌ర్గ్‌లో శుక్రవారం జ‌రిగిన తొలి టీ20లో ద‌క్షిణాఫ్రికాపై 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. హ్యాట్రిక్‌తో సహా మొత్తం 5 వికెట్లు తీసిన స్పిన్న‌ర్ ఆస్ట‌న్ అగ‌ర్‌ (5/24) జ‌ట్టు విజయంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది.

విలియమ్సన్‌ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతోన్న కివీస్‌!!విలియమ్సన్‌ హాఫ్ సెంచరీ.. నిలకడగా ఆడుతోన్న కివీస్‌!!

వార్నర్ విఫలం:

వార్నర్ విఫలం:

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన ఆసీస్ స్టార్ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్ వార్నర్ రెండేళ్ల తర్వాత ద‌క్షిణాఫ్రికా గడపై అడుగుపెట్టారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 4 ప‌రుగుల‌కే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ (42: 27 బంతుల్లో 6x4, 1x6) ధాటిగా ఆడాడు. అతనికి స్మిత్ చక్కటి సహకారం అందించాడు.

ఆకట్టుకున్న స్మిత్:

ఆకట్టుకున్న స్మిత్:

ధాటిగా ఆడే క్రమంలో ఫించ్ ఔట్ అయినా స్మిత్ (45: 32 బంతుల్లో 5x4, 1x6) ఆకట్టుకున్నాడు. స్మిత్ హాఫ్ సెంచరీ ముందు పెవిలియన్ చేరాడు. మాథ్యూ వేడ్‌ (18), మిచ‌ల్ మార్ష్‌ (19), అలెక్స్ క్యారీ (27: 22 బంతుల్లో 3x4, 1x6) ధాటిగా ఆడారు. ఇక ఇన్నింగ్స్ చివరలో అస్గన్ అగర్ (20 నాటౌట్: 9 బంతుల్లో 2x4, 1x6) వీరవిహారం చేసాడు. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. స్టెయిన్, శంసి చెరో రెండు వికెట్లు తీశారు.

ఆరంభంలోనే షాక్:

ఆరంభంలోనే షాక్:

భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా ఓ ద‌శ‌లో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. కెప్టెన్ క్వింటన్ డికాక్ (2) తొలి ఓవర్‌లోనే క్లీన్‌ బౌల్డవగా.. ఫాఫ్ డుప్లెసిస్ (24: 22 బంతుల్లో 3x4) మాత్రం కాసేపు క్రీజులో ఉన్నాడు. డస్సెన్ (6), స్మట్స్ (7), మిల్లర్ (2) పూర్తిగా నిరాశపరిచారు. దీంతో కీలక వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది.

 అగ‌ర్‌ హ్యాట్రిక్:

అగ‌ర్‌ హ్యాట్రిక్:

ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ ఆస్టన్ అగ‌ర్‌ ద‌క్షిణాఫ్రికాకు మ‌రింత షాక్ ఇచ్చాడు. అగర్ వరుస బంతుల్లో డుప్లెసిస్, ఆండిలే (0), డేల్ స్టెయిన్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండ‌వ ఆసీస్‌ ప్లేయ‌ర్‌గా ఆస్ట‌న్ నిలిచాడు. ఆపై కగిసో రబాడ (22: 19 బంతుల్లో 1x4, 2x6) బ్యాట్ ఝళిపించినా సఫారీలు 89 ర‌న్స్ చేసి ఆలౌటైయ్యారు. దీంతో 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. రెండో టీ20 ఆదివారం జరగనుంది.

మూడో అత్యల్ప స్కోరు:

మూడో అత్యల్ప స్కోరు:

బ్యాట్స్‌మన్‌ అందరూ విఫలమవడంతో దక్షిణాఫ్రికాకు భారీ ఓటమి తప్పలేదు. గతంలో పాకిస్తాన్‌, ఆసీస్‌లపై 95 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినన సఫారీలు.. ఇప్పుడు అంతకంటే దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొన్నారు. మరొకవైపు దక్షిణాఫ్రికాకు టీ20ల్లో ఇది మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.

Story first published: Saturday, February 22, 2020, 12:18 [IST]
Other articles published on Feb 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X