న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఆర్చర్‌ చేతివేలిలో గాజు ముక్క.. రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్!!

Ashley Giles says Glass piece found in Jofra Archers finger during surgery

లండన్: టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్వదేశం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అతడి కుడి చేతి గాయం తిరగబెట్టడంతో హుటాహుటిన లండన్ వెళ్లిపోయాడు. సోమవారం ఆర్చర్‌ చేతికి శస్త్రచికిత్స జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు అతడి కుడిచేతి మధ్య వేలిలో ఉన్న చిన్నపాటి గాజుముక్కను తీసేశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టెర్‌ ఆష్లీ గైల్స్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌‌ రెండో టీ20లో హైడ్రామా.. టార్గెట్ ఎంతో తెలియకుండానే బ్యాటింగ్!!న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌‌ రెండో టీ20లో హైడ్రామా.. టార్గెట్ ఎంతో తెలియకుండానే బ్యాటింగ్!!

మధ్య వేలిలో గాజు ముక్క:

మధ్య వేలిలో గాజు ముక్క:

జోఫ్రా ఆర్చర్‌ గాయంపై తాజాగా ఆష్లీ గైల్స్‌ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడాడు. 'జనవరిలో భారత్ పర్యటనకు ముందు ఆర్చర్‌ తన ఇంట్లో ఫిష్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా గాయపడ్డాడు. అప్పుడు అతడి మధ్యవేలు తెగింది. గాయం కొద్దిరోజుల్లోనే నయమవడంతో భారత పర్యటనకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆర్చర్‌ టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడాడు. అయితే వన్డే సిరీస్‌కు ముందు అతడి మోచేతి గాయం ఇబ్బంది పెట్టడంతో ఇంగ్లండ్‌కు తిరిగి పంపించాం. సోమవారం జరిగిన శస్త్రచికిత్సలో ఆర్చర్‌ మధ్య వేలిలో గాజు ముక్క బయటపడింది' అని గైల్స్‌ తెలిపారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి:

దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి:

గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి జోఫ్రా ఆర్చర్‌ మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అతడు కుడి మోచేతితో ఇబ్బందిపడుతున్నాడు. మధ్యలో గాయం తగ్గినా భారత్ పర్యటనలో మళ్లీ తిరగబెట్టింది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. 17 వన్డేల్లో 30, 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలో 155, 27, 19 పరుగులు చేశాడు. ఇక 35 ఐపీఎల్ మ్యాచులలో 46 వికెట్లు పడగొట్టాడు.

రాయల్స్‌కు భారీ షాక్:

రాయల్స్‌కు భారీ షాక్:

శస్త్రచికిత్స జరిగినందున వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌కు దూరం కానున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2018 నుంచి రాజస్థాన్ టీమ్‌కి ఆర్చర్ ఆడుతున్నాడు. ఆ ఏడాది 15 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. 2019లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్ 2021 సీజన్‌లో అసాధారణరీతిలో ఆర్చర్ రాణించాడు. 14 మ్యాచ్‌లాడి 20 వికెట్లు తీశాడు. ఫస్ట్ పవర్‌ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలిగే ఆర్చర్.. స్లాగ్ ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయగలడు. ఈ నేపథ్యంలో ఆర్చర్‌ లేకపోతే రాజస్థాన్ బౌలింగ్ విభాగం బలహీనపడనుంది.

Story first published: Wednesday, March 31, 2021, 9:28 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X