న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టిన స్మిత్.. బ్రాడ్‌మాన్ రికార్డుపై కన్ను!!

Ashesh 2019: Steve Smith surpasses Garry Sobers, eyes Don Bradman’s record

మాంచెస్టర్‌: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పురాగమనం గొప్పగా చాటాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌.. నాలుగో టెస్టులో ఏకంగా డబుల్‌ సెంచరీ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు.

యాషెస్‌ సిరీస్: స్మిత్ డబుల్‌ సెంచరీ.. సచిన్ రికార్డు బద్దలుయాషెస్‌ సిరీస్: స్మిత్ డబుల్‌ సెంచరీ.. సచిన్ రికార్డు బద్దలు

 గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టి:

గ్యారీ సోబర్స్‌ను వెనక్కినెట్టి:

ఇంగ్లండ్‌పై సాధించిన తాజా సెంచరీ స్మిత్‌కు 11వది. దీంతో ఇంగ్లండ్‌ జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌ (10)ను అధిగమించి ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్ జాబితాలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ (19) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఫామ్ ఇలాగే కొనసాగిస్తే బ్రాడ్‌మాన్‌ను అధిగమించే అవకాశం ఉంది. వా (10), చాపెల్ (9), బోర్డర్ (8)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

 ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌:

ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌:

మరొకవైపు ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక టెస్టు సెంచరీలు జాబితాలో స్మిత్‌ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (19 సెంచరీలు, ఇంగ్లండ్‌పై), సునీల్‌ గావస్కర్‌ (13 సెంచరీలు, వెస్టిండీస్‌పై), జాకబ్‌ హాబ్స్‌ (12 సెంచరీలు, ఆసీస్‌పై)లు స్మిత్‌ కంటే ముందు ఉన్నారు. గత 25 ఏళ్లలో ఇంగ్లండ్‌ గడ్డపై డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ మాత్రమే.

మూడో డబుల్‌ సెంచరీ:

మూడో డబుల్‌ సెంచరీ:

యాషెస్‌ సిరీస్‌లో మూడో డబుల్‌ సెంచరీని స్మిత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ (8), వాలీ హమ్మాండ్‌ (4)లు మాత్రమే స్మిత్‌ కంటే ముందున్నారు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించడం మరొక విశేషం. టెస్ట్ ఫార్మాట్‌లో స్మిత్ 26వ సెంచరీ చేసాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు చేయగా.. సచిన్ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు.

Story first published: Friday, September 6, 2019, 14:55 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X