ఆసీస్‌ బౌలర్లపై డెన్లీ ప్రశంసలు.. ప్రతి పరుగు తీసేందుకు ఎంతో కష్టపెట్టారు

లండన్‌: ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జో డెన్లీ ఆసీస్‌ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్కో పరుగు తీసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు ఎంతో కష్టపెట్టారు అని డెన్లీ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో సహచరులు పెవిలియన్ చేరినా.. డెన్లీ (206 బంతుల్లో 94; 14 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత పోరాటం చేసాడు. బెన్ స్టోక్స్ (67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో విలువైన పరుగులు చేసి ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగులు జతచేయడంతో ఇంగ్లాండ్‌ భారీ స్కోర్ చేసింది.

దక్షిణాఫ్రికా vs భారత్ తొలి టీ20.. టాస్‌కు వర్షం అంతరాయం

సెంచరీ చేస్తే చాలా బాగుండేది:

సెంచరీ చేస్తే చాలా బాగుండేది:

మూడో రోజు మ్యాచ్ అనంతరం డెన్లీ మాట్లాడుతూ... 'ఈ రోజు సెంచరీ చేస్తే చాలా బాగుండేది. అయినా నా ఆటతో సంతోషంగా ఉన్నా. ఈ రోజు బాగా ఆడానని అనుకుంటున్నా. ఈ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాననే ఆశాభావం నాలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ మంచి స్థితిలో ఉంది. బ్యాట్స్‌మన్‌ ఓపెనింగ్‌ చేసే ప్రతిసారీ బాగా ఆడి మంచి పరుగులు సాధించాలనే అనుకుంటాడు. నేను కూడా అంతే' అని అన్నారు.

ఆసీస్‌ బౌలర్లు పదునైన బంతులేశారు:

ఆసీస్‌ బౌలర్లు పదునైన బంతులేశారు:

'మూడోరోజు ఆసీస్‌ బౌలర్లు పదునైన బంతులేశారు. వారి అటాకింగ్‌ బాగుంది. ఈ పరిస్థితుల్లో సెంచరీ చేసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అలా జరగలేదు. ఏదేమైనా ఇంగ్లాండ్‌ జట్టుకు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కెప్టెన్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయమంటే అక్కడ చేస్తా. తనకు నచ్చినట్లు బ్యాటింగ్‌ చేయడానికి డిమాండ్‌ చేయను. తాను ఇంగ్లాండ్‌ తరఫున క్రికెట్‌ ఆడతానని ఊహించలేదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలనుకుంటున్నా. భవిష్యత్‌లోనూ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గానే ఆడమంటే సంతోషంగా ఆడుతా ' అని డెన్లీ తెలిపాడు.

 ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం:

ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం:

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం దిశగా దూసుకెళుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 313/8తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 16 జోడించి 329 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 398 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 18 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఓపెనర్ మార్కస్ హ్యారిస్ (9) బౌల్డయ్యాడు.

కష్టాల్లో ఆసీస్:

కష్టాల్లో ఆసీస్:

మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11) కూడా బ్రాడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మార్కస్ లబషేన్, స్టీవ్ స్మిత్ ఆదుకున్నారు. ఈ జోడి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లీచ్ బౌలింగ్‌లో లబషేన్ (14) స్టంపౌట్ అవ్వడం, స్మిత్ (23), మార్ష్ (24) త్వరగానే పెవిలియన్ చేరడంతో ఆసీస్ మరింత కష్టాల్లోకి వెళ్ళింది. వేడ్ (60) మాత్రం పోరాడుతున్నాడు. ప్రస్తుతం 47 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 232 పరుగులు వెనుకబడి ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, September 15, 2019, 20:31 [IST]
Other articles published on Sep 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X