న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంచలన నిర్ణయం.. టెస్టు కెరీర్‌ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా!!

Ashes series: Tim Paine Very Exciting mood After Australia Retain Ashes 2019

మెల్‌బోర్న్‌: యాషెస్‌ను తిరిగి నిలబెట్టుకోవడం ఓ చరిత్ర. నాకు చాలా ఆనందంగా ఉంది అని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టీమ్ పైనీ అన్నాడు. టెస్టు క్రికెట్ చాలా ముఖ్యం. టెస్టు కెరీర్‌ ముగిసిన తర్వాతే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో అడుగుపెడతా అని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరి టెస్టులో ఇంగ్లండ్‌ 135 పరుగులు తేడాతో ఘన విజయం సాధించడంతో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ 2-2తో సమం అయింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది.

<strong>'నా జెర్సీపై ఉండే భారత్ పేరు వల్లే ఇలా ఆడుతున్నా.. దేశం కోసం ఆడటం గర్వకారణం'</strong>'నా జెర్సీపై ఉండే భారత్ పేరు వల్లే ఇలా ఆడుతున్నా.. దేశం కోసం ఆడటం గర్వకారణం'

అత్యుత్తమ బౌలింగ్ మా సొంతం

అత్యుత్తమ బౌలింగ్ మా సొంతం

తాజాగా టీమ్ పైనీ మాట్లాడుతూ... 'గత సంవత్సరం ట్యాంపరింగ్ కుంభకోణం నేపథ్యంలో జట్టు కష్టాలను ఎదుర్కొంది. ప్రస్తుతం జట్టు బాగుంది. ఈ జట్టు ఆస్ట్రేలియా క్రికెట్లోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ ఉంది. గొప్ప బ్యాటింగ్ లైనప్‌కు కూడా మా సొంతం' అని పేర్కొన్నాడు.

 బీబీఎల్‌కు దూరం:

బీబీఎల్‌కు దూరం:

ఆసీస్‌ తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని త్యాగాలను చేయడానికి సిద్ధమయ్యా. జట్టును ముందుండి నడిపించడంపైనే దృష్టి పెడుతున్నా. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఒక కెప్టెన్‌గా నాకొచ్చి ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే నేను రీచార్జ్‌ కావాల్సి ఉంది. అందుకే బీబీఎల్‌కు స్వస్తి చెపుతున్నా. నా టెస్టు కెరీర్‌ ముగిసిన తర్వాతే బీబీఎల్‌లో అడుగుపెడతా' అని పైనీ ఎతెలిపాడు.

దృష్టంతా నా బాధ్యతపైనే:

దృష్టంతా నా బాధ్యతపైనే:

'ప్రస్తుతం నా దృష్టంతా నాపై ఉన్న బాధ్యతపైనే ఉంది. టెస్ట్ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. చివరి టెస్ట్ ముగిసే సమయానికి నా బొటనవేలు విరిగింది. నాతో పాటు పీటర్‌ సీడెల్‌ కూడా తుంటి గాయంతో సతమతమయ్యాడన్నాడు. గాయాలు పెద్దగా ఆందోళన పరిచేవి కాకపోవడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తదు' అని పైనీ చెప్పుకొచ్చాడు. ఆసీస్‌ తన తదుపరి టెస్టును పాకిస్తాన్‌తో ఆడనుంది. గబ్బా స్టేడియంలో నవంబర్‌ 21వ తేదీన ఈ టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

Story first published: Thursday, September 19, 2019, 14:30 [IST]
Other articles published on Sep 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X