న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్: మిచెల్ స్టార్క్ 'బాల్‌ ఆఫ్‌ది యాషెస్‌' ఇదే (వీడియో)

By Nageshwara Rao
Ashes: Mitchell Starc delivers ‘ball of the century’ to dismiss England batsmanJames Vince

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అభిమానులను సంభ్రమాశ్య్చర్యానికి గురి చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్‌లోని వాకా స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

నాలుగో రోజైన ఆదివారం ఆటలో భాగంగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ జేమ్స్ విన్స్‌ను ఓ అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. గంటకు143.9 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి ఒక్కసారిగా 40 సెంటీమీటర్ల మేర స్వింగ్‌ అయి జేమ్‌విన్స్‌ ఆఫ్‌ స్టంప్‌ను ఎగరగొట్టేసింది.

క్రీజులో ఉన్న జేమ్స్ విన్స్‌‌కు సైతం ఏం జరిగింతో అర్ధం కాక ఆలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బంతిని బాల్‌ ఆఫ్‌ ది సమ్మర్‌, బాల్‌ ఆఫ్‌ది యాషెస్‌, బాల్‌ ఆఫ్‌ది 21వ సెంచరీ, బాల్‌ ఆఫ్‌ ది మిలినియమ్‌ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఈ బంతిపై పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌ కూడా ప్రశంసలు కురిపించారు. 'ఈ బంతి నా బౌలింగ్ రోజులను గుర్తి చేసింది, ఎంతగానో ఎంజాయ్ చేశా. ఎడమ చేతి వాటం బౌలర్లను గర్వించేలా చేశావు' అని తన ట్విట్టర్ పోస్టు చేశాడు.

ఇదిలా ఉంటే పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులో విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది. మూడో టెస్టులో చివరి రోజైన సోమవారం వరుణుడు అంతరాయం కల్పించకపోతే ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్‌ సిరీస్‌ చేరడం ఖాయమనిపిస్తోంది.

నాలుగో రోజైన ఆదివారం వర్షం వల్ల ఆట త్వరగా ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మలన్‌ (28 బ్యాటింగ్‌), బెయిర్‌స్టో (14 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నా... తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగుల వెనుకంజలో ఉన్నది.

ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్‌ రెండు మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ చెరో వికెట్ తీశారు.

పెర్త్ టెస్టు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 403 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 662/9 డిక్లేర్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 132/4 (38.2 ఓవర్లు)
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 127 పరుగుల వెనుకంజలో ఉంది.
సోమవారం ఐదోరోజు ఆట జరగాల్సి ఉంది.

Story first published: Monday, December 18, 2017, 13:05 [IST]
Other articles published on Dec 18, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X