న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. స్మిత్‌-ఖవాజా చెత్త రికార్డు

Ashes 2019: Steve Smith, Usman Khawaja duo couldn’t open their partnership account for the third wicket

లండన్‌: ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖవాజా ఓ అరుదైన చెత్త రికార్డు నమోదు చేసారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌, ఖవాజాల జోడి మూడో వికెట్‌కు ఒక్క పరుగు కూడా చేయలేదు. 23వ ఓవర్‌లో జట్టు స్కోర్‌ 60 పరుగుల వద్ద కామెరన్‌ బెన్‌క్రాఫ్ట్‌ (13) పెవిలియన్ చేరిన అనంతరం స్టీవ్ స్మిత్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే క్రీజులో ఖవాజా 36 పరుగులతో ఉన్నాడు. ఇక 24వ ఓవర్‌లో 36 పరుగుల వద్దే ఖవాజా ఔట్ అయ్యాడు.

<strong>బీసీసీఐ వీడియో.. కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు!!</strong>బీసీసీఐ వీడియో.. కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు!!

ఖవాజా పెవిలియన్ చేరడంతో స్మిత్‌-ఖవాజాల పేరిట ఓ చెత్త రికార్డు నమోదయింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో లార్డ్స్‌ మైదానంలో మూడో వికెట్‌కు బ్యాట్స్‌మెన్‌ పరుగులేమీ చేయకుండా వెనుదిరగడం ఇది ఐదోసారి. గతంలో 1961లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కొలిన్‌ కోడ్రే, టెడ్‌ డెక్ట్సర్‌ ఆస్ట్రేలియాపై మూడో వికెట్‌కు పరుగులేమీ చేయలేదు. 58 ఏళ్ల తర్వాత స్మిత్‌, ఖవాజాలు ఆ చెత్త రికార్డు నమోదు చేసారు. అయితే ఖవాజా ఔట్ అయినా.. స్మిత్‌ (92; 161 బంతుల్లో 14X4) అద్భుతంగా ఆడి ఆసీస్‌ను మరోసారి ఆదుకున్నాడు. స్మిత్ ఆట మధ్యలో రెండుసార్లు గాయపడినా.. తిరిగి బ్యాటింగ్‌ చేయడం విశేషం.

ఇంగ్లాండ్‌ స్టార్ అరంగేట్ర బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ మోచేతికి తొలుత బంతి తగిలింది. ప్రాథమిక చికిత్స అనంతరం స్మిత్ బ్యాటింగ్‌ కొనసాగించాడు. అనంతరం స్మిత్ 80 పరుగుల వద్ద ఉన్నపుడు మరోసారి ఆర్చర్ బౌలింగ్‌లోనే గాయపడ్డాడు. ఈసారి బంతి మెడకు బలంగా తగలడంతో స్మిత్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. గాయంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరిగినా.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి 92 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 250 పరుగులకు ఆలౌటవ్వగా.. నాలుగో రోజు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 96/4తో నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 104 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. వర్షం కారణంగా ఐదవ రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.

<strong>గత రెండేళ్లలో ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమే అతిపెద్ద నిరాశ: రవిశాస్త్రి</strong>గత రెండేళ్లలో ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమే అతిపెద్ద నిరాశ: రవిశాస్త్రి

Story first published: Sunday, August 18, 2019, 15:58 [IST]
Other articles published on Aug 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X