న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2019: విరాట్ కోహ్లీ టెస్టు రికార్డుని బద్దలు కొట్టిన స్మిత్

Ashes 2019 : Steve Smith surpasses Virat Kohli In Illustrious Test List
Ashes 2019: Steve Smith surpasses Virat Kohli in illustrious Test list

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌తో టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో సాధించడంతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సైతం వెనక్కినెట్టాడు.

ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్ స్మిత్‌ ఇప్పటి వరకు 134.20 యావరేజితో 671 పరుగులు సాధించాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులతో చెలరేగిన స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

స్టీవ్ స్మిత్ ఖాతాలో మరో మైలురాయి

స్టీవ్ స్మిత్ ఖాతాలో మరో మైలురాయి

దీంతో స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో మరో స్థాయి ఆటగాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ మూడు టెస్టుల సిరీస్‌ లేదా మూడు మ్యాచ్‌లు ఆడిన సిరిస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో కోహ్లీతో పాటు పాక్ మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ రికార్డును అధిగమించాడు.

మహ్మద్ యూసఫ్‌ 665 పరుగుల రికార్డు బద్దలు

మహ్మద్ యూసఫ్‌ 665 పరుగుల రికార్డు బద్దలు

2006-07 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో మహ్మద్ యూసఫ్‌ 665 పరుగులతో ఈ జాబితాలో ఇప్పటివరకు మూడో స్థానంలో నిలిచాడు. 2017-18 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో విరాట్ కోహ్లీ 610 పరుగులు నమోదు చేశాడు. ఇప్పుడు వీరిద్దరినీ వెనక్కి నెట్టి స్మిత్ మూడో స్థానంలో నిలిచాడు.

అగ్రస్థానంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌

అగ్రస్థానంలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌

ఈ జాబితాలో ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ గ్రాహం గూచ్‌(1990లో భారత్‌పై 752 పరుగులు), వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా(2001-02 సీజన్‌లో శ్రీలంకపై 688 పరుగులు) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ రాణించడంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీ

నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీ

కాగా, ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన‍్నింగ్స్‌ల్లో 144, 142 పరుగులతో స్మిత్ రెండు సెంచరీలు సాధించాడు. ఇక, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ ఆడకపోగా... మూడో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు.

మూడు లేదా అంతకుమించి సిరిస్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

మూడు లేదా అంతకుమించి సిరిస్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు

  • 752 Graham Gooch vs India, 1990
  • 688 Brian Lara vs Sri Lanka, 2001-02
  • 671 Steve Smith vs England, 2019
  • 665 Mohammad Yousuf vs West Indies, 2006-07
  • 610 Virat Kohli vs Sri Lanka, 2017-18
Story first published: Tuesday, September 10, 2019, 13:30 [IST]
Other articles published on Sep 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X