న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్చర్ మామూలోడు కాదు, అదొక భయంకరమైన క్షణమన్న రూట్

Ashes 2019 : 'Jofra Archer Made A Big Impact' Says Joe Root || Oneindia Telugu
Ashes 2019: Jofra Archer has made a big impact, says Joe Root

హైదరాబాద్: అదొక భయంకరమైన క్షణమని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

దీంతో మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా కంగారుపడ్డారు. అనంతరం ఆసీస్ జట్టు ఫిజియో ప్రాథమిక చికిత్స అనంతరం స్టీవ్ స్మిత్ మెల్లగా రావడంతో ఒక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు.

సపోర్టింగ్ స్టాఫ్ సెలక్షన్: బంగర్‌కు కష్టమే, ఎవరికి దక్కేనో అవకాశం!సపోర్టింగ్ స్టాఫ్ సెలక్షన్: బంగర్‌కు కష్టమే, ఎవరికి దక్కేనో అవకాశం!

అయితే గాయం తీవ్రత దృష్ట్యా స్టీవ్ స్మిత్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ గాయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ స్పందించాడు. అదొక భయంకరమైన క్షణమని పేర్కొన్న జూ రూట్‌, స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. స్మిత్ మెడను బంతి బలంగా తాకడంతో తమ ఆటగాళ్లలో ఆందోళన మొదలైందని, అయితే కాసేపటికి అతడు తేరుకోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నామని తెలిపాడు.

గెలుస్తామనుకున్న రెండో టెస్టు డ్రాగా ముగియడం

గెలుస్తామనుకున్న రెండో టెస్టు డ్రాగా ముగియడం

గెలుస్తామనుకున్న రెండో టెస్టు డ్రాగా ముగియడం నిరాశను కలిగించిందని జో రూట్ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్నస్‌ లాబస్‌చేంజ్‌ తమ గెలుపుని అడ్డుకున్నాడని రూట్ అన్నాడు. ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది.

సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా

సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా

ఐసీసీ ఈ కొత్త నిబంధనల మేరకు ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా అందుకు మ్యాచ్ రిఫరీ అంగీకరించాడు. స్మిత్ స్మిత్ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లాబస్‌చేంజ్‌ మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ అరుదైన ఘనత సాధించాడు.

మార్నస్‌ లాబస్‌చేంజ్‌ అద్భుత ప్రదర్శన

మార్నస్‌ లాబస్‌చేంజ్‌ అద్భుత ప్రదర్శన

సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు మార్నస్‌ లాబస్‌చేంజ్‌ 100 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 59 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై జోరూట్ ప్రశంసల వర్షం కురిపించాడు.

జోఫ్రా ఆర్చర్ ప్రభావం

జోఫ్రా ఆర్చర్ ప్రభావం

"ఈ మ్యాచ్‌పై జోఫ్రా ఆర్చర్ ప్రభావం చాలా ఉంది. అతడి రాకతో తమ పేస్‌ విభాగం యూనిట్‌లో అత్యంత ప్రభావంగా మారింది. ఇప్పటికే ఆర్చర్ నుండి చూసిన అద్భుతమైన స్పెల్స్ మనం చూశాం. ఈ సిరిస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో అతడు ఇదే ప్రదర్శన కొనసాగిస్తాడు" అంటూ ఆర్చర్‌ను కొనియాడాడు.

ఆర్చర్ ప్రదర్శనపై బెన్ స్టోక్స్ ప్రశంసల వర్షం

ఆర్చర్ ప్రదర్శనపై బెన్ స్టోక్స్ ప్రశంసల వర్షం

ఇక, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం జోఫ్రా ఆర్చర్ ప్రదర్శనను కొనియాడాడు. యాషెల్ లాంటి ప్రతిష్టాత్మక సిరిస్‌లో ఇంతకుమించి మంచి అరంగేట్రం ఉండబోదని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. "ఆర్చర్ స్పెల్ చూసేందుకు అద్భుతంగా ఉంది. అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం" అని స్టోక్స్ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 19, 2019, 14:23 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X