న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ ఐదో టెస్టు ఇంగ్లండ్‌దే: వేడ్ సెంచరీ వృథా.. ట్రోఫీని కాపాడుకున్న ఆసీస్!!

Ashes 2019: Joe Denly, Stuart Broad shine England win fifth Test by 135 runs as series is drawn

లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ను ఇంగ్లండ్‌ సమం చేసింది. సిరీస్ ఆద్యంతం వెనుకంజలోనే నిలిచిన ఇంగ్లండ్ ఎట్టకేలకు చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. స్టువర్ట్ బ్రాడ్ (4/62) జాక్ లీచ్ (4/49) రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

<strong>ప్రొకబడ్డీ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు.. పాట్నా 'హ్యాట్రిక్' నమోదు</strong>ప్రొకబడ్డీ చరిత్రలో అత్యధిక ట్యాకిల్ పాయింట్లు.. పాట్నా 'హ్యాట్రిక్' నమోదు

ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టిన బ్రాడ్:

ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టిన బ్రాడ్:

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను ఇంగ్లండ్ బ్రాడ్ ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టాడు. ఓపెనర్ హారిస్ (9) సహా కాసేపటికే డేవిడ్ వార్నర్ (11)ను పెవిలియన్‌కు పంపాడు. ఆదుకుంటారనుకున్న లబుషేన్ (14)ను స్పిన్నర్ లీచ్ ఔట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. సిరీస్‌లో తొలిసారి అర్ధ శతకం చేయకుండా స్మిత్ (23).. బ్రాడ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ 85 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

వేడ్‌ ఒంటరి పోరాటం:

వేడ్‌ ఒంటరి పోరాటం:

ఈ సమయంలో సీనియర్ ఆటగాడు మాథ్యూ వేడ్‌ ఒంటరి పోరాటంతో ఆతిథ్య జట్టును అసహనానికి గురి చేశాడు. మిచెల్‌ మార్ష్‌ (24)తో కలసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జత చేసాడు. అనంతరం కెప్టెన్ టీమ్ పైనీ (21)తో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పైనీ అవుటైనా.. పాట్ కమిన్స్‌ (9)తో జత కలసిన వేడ్‌ ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. వేడ్‌ను ఔట్ చేసేందుకు ఇంగ్లీష్ బౌలర్లు బాగానే శ్రమించారు.

వేడ్ సెంచరీ:

వేడ్ సెంచరీ:

అయితే కమిన్స్‌ను బ్రాడ్ ఔట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. వేడ్ మాత్రం వేగంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేసాడు. సెంచరీతో ఆసీస్ శిబిరంలో గెలుపు ఆశలు రేపిన వేడ్.. భారీ షాట్‌కు ప్రయత్నించి ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ బౌలింగ్‌లో స్టంపౌటై ఆసీస్ పరాజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 313/8తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేశాయి.

దక్షిణాఫ్రికా vs భారత్ తొలి టీ20.. టాస్‌ పడకుండానే మ్యాచ్ వర్షార్పణం!!

 47ఏళ్ల తర్వాత సిరీస్ సమం:

47ఏళ్ల తర్వాత సిరీస్ సమం:

సిరీస్‌ 2-2తో సమమైనా.. స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది. 1972 (47ఏళ్లు) తర్వాత యాషెస్ సిరీస్ సమం కావడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లు సాధించాయి.

Story first published: Monday, September 16, 2019, 8:58 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X