దక్షిణాఫ్రికా vs భారత్ తొలి టీ20.. టాస్ పడకుండానే మ్యాచ్ వర్షార్పణం!!

ధర్మశాల: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ధర్మశాలలో భారీగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ని అంపైర్‌లు రద్దు చేశారు. మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అయితే సాయంత్రం సమయంలో కొంచెం విరామం ఇవ్వడంతో మైదాన సిబ్బంది రంగంలోకి దిగి.. మైదానంను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
మ్యాచ్ వర్షార్పణం:
ఇక టాస్ వేసే సమయానికి వర్షం మళ్లీ పలకరించడంతో.. తొలుత టాస్ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా వర్షం తెరిపినివ్వకపోడంతో పిచ్ మొత్తంను కవర్లతో కప్పి ఉంచారు. టాస్ సమయం దాటి దాదాపు రెండు గంటలు దాటినా.. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్టు అంపైర్‌లు ప్రకటించారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ నెల 18న మొహాలీలో రెండు టీ20 జరగనుంది.

ప్రాక్టిస్ సెషన్‌కు అంతరాయం:
శనివారం వర్షం ఒకేసారి కాకుండా తెరిపినిస్తూ కురుస్తుండడంతో టీమిండియా ప్రాక్టిస్ సెషన్‌కు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో ఆటగాళ్లు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర ధవన్, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. యువ పేసర్ నవదీప్ సైనీ వారికి బంతులు వేశాడు.

రెండు విజయాలు మాత్రమే:
2015లో భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు సఫారీలతో టీమిండియా 7 టీ20ల్లో తలపడగా.. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. తాజా టీ20 రద్దు అయింది. ఇక టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనమిది మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. ఐదు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఒక టీ20 రద్దు అయింది. ఇక టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి రోహిత్ శర్మ 84 పరుగుల దూరంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications