న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ మూడో టెస్టు: పోరాడుతున్న రూట్‌.. విజయానికి మరో 203 పరుగులు

Ashes 2019: Joe Denly and Joe Root fights to keep Englands Ashes hopes alive

లీడ్స్‌: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. యాషెస్‌ సిరీస్‌ను సాధించాలనే దిశగా ఆ్రస్టేలియా అడుగులు వేస్తుండగా.. మరోవైపు ఇంగ్లండ్‌ పట్టు వదలకుండా పోరాడుతోంది. మూడో టెస్టులో 359 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (75 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (2 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ విజయానికి మరో 203 పరుగులు కావాలి. ఇక ఆశలన్నీ రూట్, స్టోక్స్‌పైనే ఉన్నాయి. మరి ఈ ఇద్దరు ఏం చేస్తారో చూడాలి.

<strong>టేబుల్‌ టాపర్‌ జైపూర్‌కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్‌</strong>టేబుల్‌ టాపర్‌ జైపూర్‌కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్‌

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ల దెబ్బకి ఓపెనర్లు బర్న్స్‌ (7), జేసన్‌ రాయ్‌ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. రాయ్‌ పేలవ ఫామ్ కొనసాగించడంతో ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పట్లేదు. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న డెన్లీ (50) రూట్‌కు సహకారం అందించాడు.

రూట్ పోరాటం:

రూట్ పోరాటం:

ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో డెన్లీని హాజిల్‌వుడ్ (2/35) ఔట్ చేయడం ద్వారా మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద డెన్లీని ఔట్ చేసి కంగారూలకు బ్రేక్‌ ఇచ్చాడు. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రూట్ గొప్పగా పోరాడి మెరుగైన స్థితికి చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (2) లు ఉన్నారు. హాజెల్‌వుడ్‌ 2 వికెట్లు పడగొట్టగా, కమిన్స్‌కు ఒక వికెట్‌ దక్కింది.

విజయానికి 203 పరుగులు:

విజయానికి 203 పరుగులు:

ఇంగ్లండ్‌కు 7 వికెట్లు చేతిలో ఉన్నాయి.. ఇంకా 203 పరుగులు చేయాలి. ఇప్పటికి ఇంగ్లండ్‌ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. ఓటమి తప్పించుకోవడం మాత్రం అంత సులువు కాదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఆశలన్నీ రూట్‌ మీదే. బట్లర్, బెయిరిస్టో, వోక్స్, ఆర్చర్ ఉన్న నేపథ్యంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండు రోజులు ఆట మిగిలున్న నేపథ్యంలో ఫలితం రావడం మాత్రం ఖాయం.

కోహ్లీ, ర‌హానే అర్ధ‌సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్‌

 ఆదుకున్న లబుషేన్‌:

ఆదుకున్న లబుషేన్‌:

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 171/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్‌ (80; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్టోక్స్‌కు (3/56) మూడు వికెట్లు దక్కాయి. ఆర్చర్ (2/40), బ్రాడ్ (2/52) ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 179.. ఇంగ్లండ్‌ 67 పరుగులకు ఆలౌటయ్యాయి. ఆసీస్‌కు 112 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Sunday, August 25, 2019, 13:06 [IST]
Other articles published on Aug 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X