Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, ర‌హానే అర్ధ‌సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్‌

West Indies vs India, 1st Test: Viart Kohli, Anjikya Rahane fiftys Indias lead

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (51 బ్యాటింగ్‌), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (53 బ్యాటింగ్‌)లు రాణించడంతో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ, రహానే హాఫ్‌ సెంచరీలతో అజేయంగా నిలవడంతో.. భారత్‌ 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆదివారం భారత్‌ రెండు షెషన్ల పాటు దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని విండీస్‌ ముందు ఉంచితే విజయం సాధించవచ్చు.

టాపార్డర్‌ విఫలం:

టాపార్డర్‌ విఫలం:

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (16) రెండో ఇన్నింగ్‌లోనూ నిరాశపరిచాడు. బంతిని తప్పుగా అంచనా వేసి చేజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (38; 85 బంతుల్లో 4×4) పుజారా (25; 53 బంతుల్లో 1×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న ఈ జోడి స్కోరును ముందుకు నడిపారు. అయితే 30వ ఓవర్‌లో రాహుల్‌ను చేజ్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపటికే పుజారాను రోచ్‌ పెవిలియన్ చేర్చాడు. దీంతో 81 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.

కోహ్లీ-రహానే సెంచరీ భాగస్వామ్యం:

కోహ్లీ-రహానే సెంచరీ భాగస్వామ్యం:

కష్టాల్లో ఉన్న భారత్‌ను కోహ్లీ,రహానే ఆదుకున్నారు. ఈ జోడి భారత్‌ ఇన్నింగ్‌ను చక్కదిద్దారు. విండీస్‌ బౌలర్లను ఆచితూచి ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. బౌండరీల జోలికి పోకుండా స్ట్రైక్ రొటేట్ చేసారు. ఈ క్రమంలోనే 68వ ఓవర్‌లో రహానే.. 71వ ఓవర్‌లో కోహ్లీ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. కోహ్లీ,రహానేలు నాలుగో వికెట్‌కి 104 పరుగుల భాగ‌స్వామ్యం న‌మోదు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో మెరిసిన రహానే.. మరోసారి ఆకట్టుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ వైవిధ్యమైన బంతులతో రాణించాడు.

హోరాహోరీపోరులో బెంగళూరుపై ఢిల్లీ విజయం.. పవన్ శ్రమ వృధా

విసిగించిన కమిన్స్‌:

విసిగించిన కమిన్స్‌:

189/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌.. మరో 33 పరుగులు జత చేసి 222 ఆలౌట్‌ అయింది. చివరి రోజు హోల్డర్‌ (39), కమిన్స్‌ (45 బంతుల్లో 0) అడ్డుగా నిలిచి భారత బౌలర్లను విసిగించారు. కమిన్స్‌ అద్భుత డిఫెన్స్‌తో వికెట్‌ చేజార్చుకోకుండా తొలి గంట పాటు బ్యాటింగ్ చేసాడు. అయితే 74వ ఓవర్‌లో షమీకి దొరికిపోవడంతో హోల్డర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే కమిన్స్‌ను జడేజా బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ బౌలింగే హైలైట్‌. రెండో రోజు విండీస్‌ 189/8కి పరిమితం అయిందంటే కారణం ఇషాంత్‌. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 297 ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 25, 2019, 12:18 [IST]
Other articles published on Aug 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+