న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ మూడో టెస్టుకూ అండర్సన్‌ దూరం.. మొయిన్‌ అలీకి నిరాశే!!

Ashes 2019: James Anderson left out as England name unchanged squad for 3rd Test

హెడింగ్లీ : ఇంగ్లండ్‌ స్వింగ్ మాస్టర్ జేమ్స్‌ అండర్సన్‌ యాషెస్‌ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో మళ్లీ అండర్సన్‌కు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా తొలి టెస్టులో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేసిన అండర్సన్‌.. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆడలేదు. మూడు టెస్టుకు జిమ్మీ అందుబాటులో ఉంటాడని భావించినప్పటికీ అది జరగలేదు.

<strong>విజ్జీ ట్రోఫీ నుండి వైదొలిగిన జమ్మూకాశ్మీర్</strong>విజ్జీ ట్రోఫీ నుండి వైదొలిగిన జమ్మూకాశ్మీర్

కౌంటీ మ్యాచ్‌లో జిమ్మీ:

కౌంటీ మ్యాచ్‌లో జిమ్మీ:

జిమ్మీ మూడో టెస్టులో ఆడకపోయినా ఆగస్టు 20 నుంచి నార్త్‌ క్రికెట్‌ క్లబ్‌లో జరగబోయే ఓ కౌంటీ మ్యాచ్‌లో పాల్గొంటాడని, ఆ మ్యాచ్‌తో అండర్సన్‌ ఫిట్‌నెస్‌పై ఓ అవగాహన ఏర్పడుతుందని సదరు ఈసీబీ అధికారి పేర్కొన్నాడు. జిమ్మీ స్థానంలో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ప్రపంచకప్ హీరో జోఫ్రా ఆర్చర్‌ తన పదునైన బంతులతో ఆరంగేట్ర మ్యాచ్‌లోనే ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. దీంతో మూడో టెస్టుకు ఆర్చర్‌ ఎంపికయ్యాడు.

బ్యాటింగ్‌ వైఫల్యం:

బ్యాటింగ్‌ వైఫల్యం:

రెండో టెస్టులో మొయిన్‌ అలీ స్థానంలో చోటు దక్కించుకున్న జాక్‌ లీచ్‌ సత్తా చాటాడు. కీలక సమయంలో వికెట్లు తీయడంతో.. మూడో టెస్టుకు కూడా అలీని పక్కకు పెట్టి లీచ్‌ను తుది జట్టులోకి తీసుకుంది ఇంగ్లండ్ యాజమాన్యం. ఇంగ్లండ్‌ జట్టు బౌలింగ్‌లో అందుకోగా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. బ్యాటింగ్‌ వైఫల్యంతోనే తొలి టెస్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. సిరీస్‌ను సమం చేయాలంటే ఇంగ్లండ్ బ్యాటింగ్‌ గాడిలో పడాల్సిందే.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లు

ఇంగ్లండ్‌ జట్టు:

ఇంగ్లండ్‌ జట్టు:

జేసన్‌ రాయ్‌, బర్న్స్‌, జో రూట్‌ (కెప్టెన్), డెన్లీ, బెయిర్‌ స్టో, జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, స్యామ్‌ కరన్‌, జాక్‌ లీచ్‌, క్రిస్‌ వోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువార్ట్‌ బ్రాడ్‌.

Story first published: Tuesday, August 20, 2019, 12:04 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X