న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు సోదరి లేదు.. ఉంటే స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని!!

Ashes 2019: If I had a sister, I would have wanted her to marry Ben Stokes says Graeme Swann

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఒక వికెట్ తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా.. బెన్‌ స్టోక్స్‌ (219 బంతుల్లో 135 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. చివరి వికెట్‌కు 73 పరుగులు చేయాల్సిన స్థితిలో జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)తో కలిసి స్టోక్స్‌ వీరోచితంగా పోరాడాడు.

<strong>యూఎస్‌ ఓపెన్‌.. ఫెద‌ర‌ర్‌ను వణికించిన భారత టెన్నిస్ ప్లేయర్‌</strong>యూఎస్‌ ఓపెన్‌.. ఫెద‌ర‌ర్‌ను వణికించిన భారత టెన్నిస్ ప్లేయర్‌

సోదరి ఉంటే స్టోక్స్‌కిచ్చి పెళ్లి చేసేవాణ్ని:

ఇంగ్లండ్‌ అద్భుతమైన విజయాన్ని అందించిన బెన్‌ స్టోక్స్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది. మాజీలతో సహా ప్రతి ఒక్కరూ స్టోక్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ అందరి కంటే బిన్నంగా స్పందించాడు. తనకే ఓ సోదరి ఉంటే.. కచ్చితంగా స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 'నాకు సోదరి లేదు.. ఉంటే కచ్చితంగా స్టోక్స్‌కు ఇచ్చి పెళ్లి చేసేవాణ్ని' అని స్వాన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం స్వాన్‌ వ్యాఖ్యలు ట్విటర్‌లో వైరల్ అయ్యాయి.

 స్టోక్స్‌-లీచ్‌ల రికార్డు:

స్టోక్స్‌-లీచ్‌ల రికార్డు:

ఆసీస్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఇంకా వికెట్‌ మిగిలి ఉండగా ఛేదించింది. 10వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా బెన్‌ స్టోక్స్‌-జాక్‌ లీచ్‌లు నిలిచారు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు కుశాల్‌ పెరీరా-విశ్వ ఫెర్నాండోలు 10వ వికెట్‌కు అజేయంగా 78 పరుగులు చేశారు. అది ఇప్పటికీ తొలి స్థానంలో ఉండగా.. స్టోక్స్‌-లీచ్‌ల రికార్డు రెండో స్థానాన్ని ఆక్రమించింది.

పైనీపై తీవ్ర విమర్శలు

పైనీపై తీవ్ర విమర్శలు

ఇంగ్లండ్‌ గెలవడంతో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లి దాన్ని కోల్పోవడంతో స్టోక్స్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. లయన్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడగా.. బంతి ప్యాడ్లకు తాకింది. వెంటనే ఆసీస్‌ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించాడు. అయితే బంతి మిడిల్‌ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. ఒకవేళ ఆ సమయంలో స్టోక్స్‌ ఔటై ఉంటే ఆసీస్‌ గెలిచేది. వికెట్‌ తేడాతోనే ఇంగ్లండ్‌ గెలవడానికి పైనీ తప్పుడు నిర్ణయమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Story first published: Tuesday, August 27, 2019, 13:15 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X