న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ 2019: పట్టు బిగిస్తోన్న ఆసీస్, ఇంగ్లాండ్ 200/5

Ashes 2019: Hazlewood leaves England wobbling despite best efforts of Burns and Root on Day 4

హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ (4/48) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ మూడో రోజైన శుక్రవారం వెలుతురు లేమితో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టోక్స్‌ (7), బెయిర్‌స్టో (2) క్రీజులో ఉన్నారు.

వర్షం కారణంగా మూడో రోజు 64 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఇంకా 297 పరుగులు వెనుకంజలో ఉంది. వర్షం అడ్డంకిగా మారడంతో మూడో రోజు మార్నింగ్ సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ముందస్తుగానే లంచ్ విరామాన్ని తీసుకోవాలని అంపైర్లు ఇరు జట్లకు సూచించారు.

మాజీ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్‌ ఖాదిర్‌ గుండెపోటుతో కన్నుమూతమాజీ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్‌ ఖాదిర్‌ గుండెపోటుతో కన్నుమూత

లంచ్‌ తర్వాత

లంచ్‌ తర్వాత ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఇంగ్లాండ్ తిరిగి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌ కాసేపటికే ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ ఓవర్టన్‌ (5) వికెట్‌ను చేజార్చుకుంది. హేజిల్‌వుడ్‌ ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీని ఆడబోయిన ఓవర్టన్‌ రెండో స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం కెప్టెన్ జో రూట్ క్రీజులోకి వచ్చాడు.

మూడో వికెట్‌కు 141 పరుగులు

బర్న్స్‌తో కలిసి జో రూట్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరి కలిసి జోడీ మూడో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లాండ్‌ ఒకానొక దశలో 166/2తో మెరుగ్గా నిలిచింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన బర్న్స్‌, రూట్‌లను వరుస ఓవర్లలో హేజిల్‌వుడ్‌ ఔట్ చేశాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 200/5

ఆ తర్వాత కొద్దిసేపటికే జేసన్‌ రాయ్‌ (22)ని కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 200 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అంతకముందు ఆస్ట్రేలియా 497/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. స్మిత్(211) డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, September 7, 2019, 11:53 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X