న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏదొక రోజు ఇంగ్లాండ్‌ జట్టుకు కోచ్‌ అవుతా: గత చేదు అనుభవంపై ఫ్లింటాఫ్

Ashes 2019: Flintoff wants to be England coach one day but not yet

హైదరాబాద్: ఏదొక రోజు ఇంగ్లాండ్‌ జట్టుకు కోచ్‌ అవుతానని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు గతంలో తాను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా చులకన భావంతో చూశారని తాజాగా ఫ్లింటాఫ్ తెలిపాడు.

ఇమ్రాన్, షకీబ్ సరసన: కెప్టెన్‌గా రషీద్ ఖాన్ అరుదైన రికార్డుఇమ్రాన్, షకీబ్ సరసన: కెప్టెన్‌గా రషీద్ ఖాన్ అరుదైన రికార్డు

తాజాగా బీబీసీ టెస్టు మ్యాచ్ స్పెషల్ కార్యక్రమంలో ఫ్లింటాఫ్ మాట్లాడుతూ "2014లో ఇంగ్లండ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్యూ కోసం ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేశా. నెలరోజులు గడిచినా నాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఏమైందని కనుక్కుంటే అప్పుడు నాకు ఫోన్‌ వచ్చింది. వేరే వాళ్లను ఎంపిక చేశామని చెప్పారు" అని అన్నాడు.

"ఇంగ్లాండ్‌ జట్టుకు కోచ్‌గా చేయాలని ఉంది. దాంతో లాంకాషైర్‌ కూడా కోచ్‌గా చేయడాన్ని ఇష్టపడతా. ఏదొ ఒక రోజు ఇంగ్లండ్‌కు కోచ్‌గా చేసే అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను" అని ఫ్లింటాఫ్ అన్నాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫ్లింటాఫ్ ఆ ఏడాది యాషెస్‌ సిరీస్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

2006-07 సీజన్‌ యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5-0 తేడాతో వైట్‌వాష్‌ అయిన ఇంగ్లాండ్‌ జట్టుకు ఫ్లింటాఫ్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ తరుపున మొత్తం 79 టెస్టులు ఆడిన ఫ్లింటాప్ 3845... 141 వన్డేల్లో 3394 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 395 వికెట్లు తీయడంతో పాటు 99 క్యాచ్‌లు పట్టాడు.

నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్‌గా కొనసాగుతున్న ట్రేవర్ బేలిస్ యాషెస్ సిరిస్ అనంతరం ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అతడి స్థానంలో మరో కోచ్‌ని భర్తీ చేసే విషయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Story first published: Saturday, September 7, 2019, 17:07 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X