న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ సమరం.. తొలి టెస్టుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిద్ధం

Ashes 2019: England vs Australia 1st Test, When And Where To Watch Live, Match prediction, Jofra Archer misses out

బర్మింగ్‌హామ్‌: వన్డే ప్రపంచకప్‌-2019 తర్వాత క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేసేందుకు మరో పోరు సిద్ధమైంది. 141 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న యాషెస్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. ఈరోజు యాషెస్ సిరీస్‌కు తెర లేవనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో గురువారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌తో ప్రారంభం కానుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

హోరాహోరీ ఖాయం:

హోరాహోరీ ఖాయం:

2017-18 సీజన్‌లో ఆసీస్‌లో జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియా 4-0తో సొంతం చేసుకుంది. అంతకుముందు 2015లో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3-2తో గెలుచుకున్న ఇంగ్లండ్‌.. మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలమైన జట్టు, ప్రపంచకప్‌ గెలిచిన ఉత్సాహం, సొంతగడ్డపై సిరీస్‌ జరుగుతోన్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. బాల్‌ టాంపరింగ్‌ వివాదం నుండి కోలుకోవడం, స్మిత్‌-వార్నర్‌ల పునరాగమనంతో ఆసీస్ కూడా సిరీస్‌పై ఆశలు పెట్టుకుంది. దీంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

దుర్భేద్యంగా బ్యాటింగ్:

దుర్భేద్యంగా బ్యాటింగ్:

ప్రపంచకప్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడిన జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ఇప్పుడు యాషెస్‌ తొలి టెస్టులో ఆడుతున్నారు. రూట్‌ తొలిసారి యాషెస్‌ సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఓపెనర్లు బర్న్స్, జేసన్‌ రాయ్‌లతో పాటు రూట్, డెన్లీలతో టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బెయిర్‌స్టో, బట్లర్‌, అలీ, బెన్‌ స్టోక్స్‌లతో మిడిల్ కూడా దుర్భేద్యంగా కనిపిస్తోంది.

అండర్సన్‌పై ఆశలు:

అండర్సన్‌పై ఆశలు:

బౌలింగ్‌లో సీనియర్ పేసర్ అండర్సన్‌పైనే ఇంగ్లాండ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అండర్సన్‌తో కలిసి స్టువర్ట్ బ్రాడ్‌తో కొత్త బంతి పంచుకోనున్నాడు. ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. అయితే ప్రపంచకప్‌లో మెరిసిన పేసర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.

స్టార్క్‌పై వేటు:

స్టార్క్‌పై వేటు:

దక్షిణాఫ్రికా, భారత్‌తో సిరీస్‌ ఓడిపోవడం.. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఆసీస్ కష్టాలో ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ తమ ప్రతిష్ట పెంచుకునేందుకు యాషెస్‌ ఓ అవకాశం. ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడం ఆసీస్‌పై ఒత్తిడి పెంచనుంది. మెగా టోర్నీలో వార్నర్, స్మిత్ సత్తా చాటినా.. మునుపటి వేడి లేదు. నిలకడగా ఆడే ఖవాజా జట్టు బలం. మిడిలార్డర్‌లో పైన్‌, హెడ్, వేడ్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. సీనియర్‌ పేసర్ మిషెల్‌ స్టార్క్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో కమిన్స్, హేజిల్‌వుడ్‌, ప్యాటిన్సన్‌పైనే ఆసీస్ ఆశలు పెట్టుకుంది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ఇంగ్లండ్‌: రోరీ బర్న్స్, జేసన్ రాయ్, జో రూట్(కెప్టెన్), జోయి డెన్లే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

ఆస్ట్రేలియా: టీమ్ పైన్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌/ మిషెల్‌ మార్ష్‌, మథ్యూ వేడ్, పాట్ కమిన్స్, ప్యాటిన్సన్, నాథన్ లయన్, పీటర్ సిడిల్‌/ జోష్ హాజల్‌వుడ్‌.

Story first published: Thursday, August 1, 2019, 10:12 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X