న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో యాషెస్ రెండో టెస్టు: ఇరు జట్ల నమోదైన గణాంకాలివే!

Ashes 2019: Englands second Test against Australia in Opta numbers

హైదరాబాద్: ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగడంతో ఆతిథ్య జట్టుపై ఆసీస్ అలవోక విజయాన్ని నమోదు చేసింది.

'ఆసీస్‌ను ఓడించడానికి కేవలం ఆర్చర్‌పై ఆధారపడటం ఇష్టం లేదు'

ఫలితంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆగస్టు 14(బుధవారం) నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పుంజుకోవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం....

తొలి టెస్టులో ఓడి 14 ఏళ్లు

తొలి టెస్టులో ఓడి 14 ఏళ్లు

14 - యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టు తన తొలి టెస్టులో ఓడి 14 ఏళ్లు అవుతుంది.

7 - ఇంగ్లాండ్‌తో జరిగిన గత ఏడు టెస్టుల్లో ఆస్ట్రేలియా వరుసగా విజయాలను నమోదు చేసింది. ఏడు టెస్టుల్లో ఆరింట నెగ్గింది.

4 - రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇరు జట్లు మంచి రికార్డుని కలిగి ఉన్నాయి. ఇంగ్లాండ్ ఆడిన గత ఐదు టెస్టుల్లో నాలుగింట విజయం సాధించగా... ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్‌లో ఆడిన 21 టెస్టుల్లో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.

2008లో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి

2008లో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి

2008 - చివరగా ఇంగ్లాండ్ సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన సంవత్సరం. 2008లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆతిథ్య జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయింది.

8/103 - లార్డ్స్ టెస్టులో అరంగేట్రం చేస్తోన్న ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గత సెప్టెంబర్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. అయితే, అంతకముందు లార్డ్స్ వేదికగా జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అతడు నమోదు చేసిన గణాంకాలు.

76 - యాషెస్ టెస్టు సిరిస్‌లో ఫామ్‌లో ఉన్న ఆటగాడు. ఇంగ్లాండ్‌పై గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ కనీసం 76 పరుగులను నమోదు చేస్తూనే ఉన్నాడు.

లార్డ్స్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:

లార్డ్స్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:

టిమ్ పైన్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడ్డిల్, నాథన్ లయాన్, జోష్ హెజెల్‌ఉడ్

Story first published: Tuesday, August 13, 2019, 17:45 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X