న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ ఐదో టెస్టు: పట్టుబిగించిన ఇంగ్లండ్‌.. ఆసీస్‌కు భారీ లక్ష్యమే!!

Ashes 2019, 5th Test: Joe Denly, Ben Stokes shines as England finish Day 3 with big lead

లండన్‌: యాషెస్ చివరి టెస్టులో ఇంగ్లండ్ జోరు కనబరుస్తోంది. ఓపెనర్‌ జాన్‌ డెన్లీ (94), ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ (67) అర్ధ శతకాలు చేసి రాణించడంతో యాషెస్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటికే 1-2తో సిరీస్‌లో వెనుకబడిన ఆతిథ్య జట్టు ఐదో టెస్టులో భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. మొత్తంగా 382 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్‌.. ఆసీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచనుంది.

<strong>ఆరు ఓటముల తర్వాత గెలుపు బాట.. గుజరాత్‌పై పల్టాన్ విజయం</strong>ఆరు ఓటముల తర్వాత గెలుపు బాట.. గుజరాత్‌పై పల్టాన్ విజయం

మంచి ఆరంభమే:

మంచి ఆరంభమే:

ఓవల్‌ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టులో ఓవర్‌నైట్‌ స్కోరు 9/0తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆట ముగిసేసరికి 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే లభించింది. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించాక బర్న్స్ (20) ఔటయ్యాడు. కుదురుకున్నట్లే అనిపించిన కెప్టెన్ జో రూట్ (21) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.

డెన్లీ పోరాటం:

డెన్లీ పోరాటం:

ఈ దశలో ఓపెనర్ జో డెన్లీ (206 బంతుల్లో 94; 14 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత పోరాటం చేసాడు. బెన్ స్టోక్స్ (67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగులు జతచేశారు. అయితే సిడిల్ దెబ్బకు డెన్లీ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. లయన్‌ స్టోక్స్‌ను ఔట్ చేసాడు. అనంతరం జోస్ బట్లర్ (47; 6 ఫోర్లు) బ్యాట్ జులిపించాడు.

ఛేదన ఆసీస్‌కు కష్టమే:

ఛేదన ఆసీస్‌కు కష్టమే:

సామ్ కర్రన్, క్రిస్ వోక్స్ అండగా బట్లర్ పరుగులు చేసి ఇంగ్లండ్‌ స్కోరును 300 దాటించాడు. అయితే అర్ధ సెంచరీ ముందు బట్లర్‌ను సిడిల్ పెవిలియన్ చేర్చాడు. ఆట ముగిసే సమయానికి జోఫ్రా ఆర్చర్‌ (3 బ్యాటింగ్‌), లీచ్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ స్పిన్నర్‌ లియాన్‌ (3/65) మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్‌, మార్ష్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. రెండు రోజుల ఆట ఉన్నప్పటికీ.. దాదాపు 400 పరుగుల ఛేదన ఆసీస్‌కు చాలా కష్టమే. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 225 స్కోరు చేసింది.

Story first published: Sunday, September 15, 2019, 11:17 [IST]
Other articles published on Sep 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X