న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్స్: 30 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్టార్క్ (వీడియో)

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 30 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 30 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్‌లో భాగంగా షెఫల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు.

షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సోమవారం తొలి హ్యాట్రిక్ తీసిన స్టార్క్ మంగళవారం మరో హ్యాట్రిక్ తీశాడు. తద్వారా ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 1978 తరువాత రెండు ఇన్నింగ్స్‌లోనూ హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ అరుదైన గుర్తింపు పొందాడు.

Ashes 2017-18: Mitchell Starc takes second hat-trick for New South Wales

కాగా, షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి బౌలర్ మిచెల్ స్టార్కే. అయితే ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడు. ఇక, టెస్టు క్రికెట్‌లో కూడా 1912లో ఇలాంటి రికార్డు ఒకేసారి నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్ టీజే మాథ్యూస్ ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో రెండుసార్లు హ్యాట్రిక్ తీశాడు.

ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 1979 తర్వాత ఇలా డబుల్ హ్యాట్రిక్ తీయడం ఇదే తొలిసారి. 1979లో కంబైన్డ్ ఎలెవన్ టీమ్‌కు చెందిన అమిన్ లఖానీ ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియాపై డబుల్ హ్యాట్రిక్ తీశాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ ల్లో స్టార్క్ హ్యాట్రిక్ సాధించే క్రమంలో బెహ్రెన్ డార్ఫ్, మూడీలను అవుట్ చేయడం మరో విశేషం.

మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో న్యూసౌత్ వేల్స్ జట్టు 171 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. నవంబర్ 23నుంచి ఇంగ్లాండ్‌తో ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో స్టార్క్ సత్తా చాటుకోవడం ఆ జట్టులో ఆనందం వ్యక్తమవుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X