న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్ల మధ్య ఎలా పరిగెత్తాలంటే!: ఆసీస్ క్రికెటర్లకు ఉసేన్ బోల్ట్ ట్రైనింగ్

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్ నవంబర్ 23న బ్రిస్బేన్ వేదికా ప్రారంభం కానుంది. యాషెస్ సిరిస్ కోసం జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌ను తన సపోర్టింగ్ టీమ్‌లో మెంబర్‌ని

By Nageshwara Rao
Ashes 2017/18: Australia seek Usain Bolt's help to sprint between the wickets

హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్ నవంబర్ 23న బ్రిస్బేన్ వేదికా ప్రారంభం కానుంది. యాషెస్ సిరిస్ కోసం జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్‌ను తన సపోర్టింగ్ టీమ్‌లో మెంబర్‌ని చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఉసేన్ బోల్ట్ సాయంతో వికెట్ల మధ్య ఆసీస్ క్రికెటర్లు వేగం పెంచాలన్నది బోర్డు ఆలోచన.

ఇందులో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ఉసేన్ బోల్ట్ సేవలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. వికెట్ల మధ్య క్రికెటర్లు వేగంగా పరుగెత్తాలంటే ఏం చేయాలన్నదానిపై అతడితో చర్చించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న బోల్ట్ ఆసీస్ క్రికెటర్లకు ట్రైనింగ్ మొదలు పెట్టేశాడు.

ఈ నేపథ్యంలో పరుగు విషయంలో క్రికెటర్లలో ఉండే ప్రధాన లోపాన్ని వివరించాడు. పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అదే అసలు సమస్య అని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని పేర్కొన్నాడు.

పరుగుల చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది ఆగస్టులో లండన్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో బోల్ట్ సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విధంగా వాడుకుంటోంది. బోల్ట్ సూచనలు కచ్చితంగా తమకు పనికొస్తాయని ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ అన్నాడు.

'తొలి రెండు అడులే కీలకమని, అవి సరిగ్గా వేయగలిగితే పరుగెత్తే వేగాన్ని పెంచుకోవచ్చని బోల్ట్ చెప్పినట్లు హ్యాండ్స్‌కాంబ్ తెలిపాడు. అతని సూచనలు తాము కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 13:35 [IST]
Other articles published on Nov 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X