న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు: తొలి ఇన్నింగ్‌లో అవమానకరంగా ఇంగ్లాండ్ ఆలౌట్

Ashes 1st test 2021 at Gabba: England all out 147, Captain Pat Cummins bags five wickets

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగే యాషెస్ టెస్ట్ సిరీస్ ఆరంభమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మొదలైంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. జనవరి 18వ తేదీన ముగుస్తుంది. ఈ దఫా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2019లో యాషెస్ సిరీస్‌ను డ్రా ముగిసింది. ప్రస్తుతం యాషెస్ కప్ కంగారూల ఆధీనంలో ఉంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ గడ్డపై అడుగు పెట్టింది ఇంగ్లాండ్.

తొలి టెస్ట్‌లో కుప్పకూలిన ఇంగ్లాండ్..

తొలి టెస్ట్‌లో కుప్పకూలిన ఇంగ్లాండ్..

తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. 147 పరుగులకే చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం ఎదురొడ్డి నిలవలేకపోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు ఒల్లీ పోప్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ మాత్రమే కొంత వరకు ప్రతిఘటించగలిగారు. వారిద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యమే టాప్. ఒల్లీ పోప్-35, జోస్ బట్లర్-39 పరుగులు చేశారు. ఓపెనర్ హసీబ్ హమీద్-25, లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్రిస్ వోక్స్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నారు. మరెవరూ డబుల్ ఫిగర్‌ను కూడా అందుకోలేకపోయారు. డేవిడ్ మలన్-6, కేప్టెన్ జో రూట్-0, ఒల్లీ రాబిన్‌సన్-0, మార్క్‌వుడ్-8, జాక్ లీచ్-2 పరుగులు చేశారు.

నిప్పులు చెరిగిన ఫాస్ట్ బౌలర్లు..

నిప్పులు చెరిగిన ఫాస్ట్ బౌలర్లు..

ఇంగ్లాండ్ జట్టును కుప్పకూల్చిన క్రెడిట్ మొత్తం ఫాస్ట్ బౌలర్లకే దక్కుతుంది. తొలి ఓవర్ తొలి బంతి నుంచే వారి వికెట్ల వేట ఆరంభమైంది. తొలి ఓవర్ తొలి బంతికే బెయిల్స్ గాల్లోకి లేచాయంటే- వారి పట్టుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిఛెట్ స్టార్క్ సంధించిన తొలి ఓవర్‌ తొలి బంతికి ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి బంతికే వికెట్ తీసుకోవడం 85 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. మిఛెల్ స్టార్క్-2, జోష్ హేజిల్‌వుడ్-2, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నారు.

కేప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అయిదు వికెట్లు..

కేప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అయిదు వికెట్లు..

ఇక మిగిలిన అయిదు వికెట్లూ కేప్టెన్ పాట్ కమ్మిన్స్ ఖాతాలోకి వెళ్లాయి. కేప్టెన్‌గా అతనికి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. బౌలర్‌గా, కేప్టెన్‌గా తన సత్తా నిరూపించుకోగలిగాడీ ఫాస్ట్ బౌలర్. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ తొలి టెస్ట్.. తొలి ఇన్నింగ్‌లో తన జట్టును ఆధిక్యంలో నిలబెట్టగలిగాడు. ఇక బ్యాటర్లు ఏం చేస్తారనేది ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్ మీద డిపెండ్ అయి ఉంది. గబ్బా స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో.. ఇంగ్లాండ్ కూడా మేజిక్ చేస్తారనడంలో సందేహాలు అక్కర్లేదు.

వర్షం వల్ల ఆలస్యం..

వర్షం వల్ల ఆలస్యం..

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్ ముగిసిన వెంటనే వర్షం పడింది. దీనితో ఆస్ట్రేలియా అనుకున్న సమయానికి తన ఇన్నింగ్‌ను ఆరంభించలేకపోయింది. వర్షం పడిన వెంటనే గ్రౌండ్ స్టాఫ్.. పిచ్‌ను కవర్ చేశారు. భారీ వర్షం కాకపోవడం వల్ల 30 నిమిషాల తరువాత మ్యాచ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కాకపోవడం వల్ల ఆసీస్ బ్యాటర్లు త్వరగానే క్రీజ్‌లోకి దిగే ఛాన్స్ ఉంది.

బెన్‌స్టోక్స్ ఫెయిల్..

బెన్‌స్టోక్స్ ఫెయిల్..

సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ బ్యాట్ పట్టుకున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్.. బెన్ స్టోక్స్.. విఫలం అయ్యాడు. మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల అతను ఆరునెలలకు పైగా విశ్రాంతిలో ఉంటోన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు కూడా దూరం అయ్యాడు. ఆ వెంటనే జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లోనూ ఆడలేదు. యాషెస్ టెస్ట్ సిరీస్ కోసం అందుబాటులోకి వచ్చాడు. ఇన్ని నెలల విరామం తరువాత క్రీజ్‌లోకి దిగిన బెన్‌స్టోక్స్ ఆకట్టుకోలేకపోయాడు. అయిదు పరుగులకే వెనుదిరిగాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో లంబుషెన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Story first published: Wednesday, December 8, 2021, 11:09 [IST]
Other articles published on Dec 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X