న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ తొలగింపు: వరల్డ్ కప్ ముంగిట ఆప్ఘన్ బోర్డు అనూహ్య నిర్ణయం

Asghar Afghan sacked as Afghanistan captain; ACB announces three different captains across formats

హైదరాబాద్: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్‌ను మూడు ఫార్మాట్ల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వరల్డ్‌కప్‌కు ముందు అస్గర్ ఆఫ్ఘన్‌ నాయకత్వంలోని ఆప్ఘనిస్థాన్ జట్టు ఐర్లాండ్‌తో ముగిసిన మూడు సిరిస్‌లను నెగ్గినప్పటికీ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆస్గర్ స్థానంలో గులాబ్దిన్ నాబ్‌

ఆస్గర్ స్థానంలో గులాబ్దిన్ నాబ్‌

శుక్రవారం సమావేశమైన ఆఫ్గాన్‌ సెలక్షన్‌ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు ఫార్మట్‌లకు ముగ్గురు కెప్టెన్లు ఉండాలని బోర్డు నిర్ణయించింది. కాగా, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్గర్ స్థానంలో గులాబ్దిన్ నాబ్‌ని బోర్డు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గులాబ్దిన్ నాబ్‌ సారథ్యంలోనే ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆప్ఘన్ జట్టు బరిలోకి దిగనుంది.

వైస్‌కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌

వైస్‌కెప్టెన్‌గా రషీద్ ఖాన్‌

మరోవైపు టీ20లకు రషీద్ ఖాన్, టెస్టుల్లో రెహ్మాత్ షాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రషీద్ ఖాన్‌ను వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా బోర్డు నియమించింది. ఈ మార్పులు రాబోయే వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుకు కలిసొస్తుందే లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కెప్టెన్‌గా ఆస్గర్ రికార్డు:

కెప్టెన్‌గా ఆస్గర్ రికార్డు:

ఆస్ఘర్ నాయకత్వంలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఈ మధ్య కాలంలో అనేక విజయాలను నమోదు చేసింది. ఇటీవలే ఐర్లాండ్‌తో ముగిసిన మూడు ఫార్మాట్లలో కూడా విజయాలను సాధించింది. అతడి కెప్టెన్సీలో ఆప్ఘనిస్థాన్ జట్టు మొత్తం 56 వన్డేలాడగా అందులో 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇదిలా ఉంటే, తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననుండటంతో అఫ్గాన్‌ ఆటగాళ్లతో పాటు, అభిమానులు సైతం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

టీ20ల్లో మంచి రికార్డు

టీ20ల్లో మంచి రికార్డు

ఇక, 46 టీ20 మ్యాచ్‌లాడి 37 విజయాలను నమోదు చేసింది. అస్గర్ నాయకత్వంలో ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టు మ్యాచ్‌లాడింది. భారత్‌తో ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో ఓడగా... ఐర్లాండ్‌తో ఆడిన ఏకైక టెస్టులో మాత్రం విజయం సాధించింది.

Story first published: Friday, April 5, 2019, 19:41 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X