న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంబంధం లేని ట్వీట్: పరువు పోగొట్టుకున్న ఐసీసీ

By Nageshwara Rao
Asaram Bapu Verdict: ICC tweets ‘Narayan, Narayan’ on viral video of Narendra Modi, Asaram Bapu

హైదరాబాద్: మైనర్ బాలిక రేప్ కేసులో జోధ్‌పూర్ కోర్టు ఆశారాం బాపూను దోషిగా తేల్చిన వేళ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాకింగ్‌కి గురైంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు సంబంధించిన అన్ని కథనాలు, వార్తలు షేర్ చేసే ఈ ఖాతాలో భారత రాజకీయాలకు సంబంధించి ఆశారాం బాపు వీడియోని షేర్ అయింది. దీంతో ఐసీసీ ఫాలోవర్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

అసలేం జరిగింది?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఆశారాం బాపూ ఉన్న పాత వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి హ్యాకర్లు రీట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి ''నారాయణ్ నారాయణ్'' అనే కామెంట్‌ను జత చేశారు. దీంతో ఐసీసీ క్రికెట్‌యేతర వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది వెంటనే గమనించిన ఐసీసీ ట్విట్టర్ ఖాతా నిర్వహకులు ఆ ట్వీట్‌ని వెంటనే డిలీట్ చేశారు. అప్పటికే కొందరు దానిని స్క్రీన్ షాట్ తీయడంతో ఇప్పడు ఆ ట్విట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంపై ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. క్రికెట్‌కు సంబంధం లేని ట్వీట్‌ను రీట్వీట్ చేయడంపై కూడా ఐసీసీ క్షమాపణలు కోరింది. ఈ ట్వీట్‌ను వెంటనే తొలగించినప్పటికీ.. ఎవరైనా మనస్థాపం చెందితే క్షమించాలని వేడుకుంది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారణ చేపట్టనున్నట్టు ట్వీట్ చేసింది.

Story first published: Wednesday, April 25, 2018, 18:54 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X