న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్షదీప్ ఆ రాత్రంత నిద్రపోలేదు..! అర్ష వల్ల టీమిండియాకు పక్కా మేలు జరుగుతుంది : కోచ్ జశ్వంత్ రాయ్

Arshadeep Singh did not sleep that night Says His Coach Jaswant Rai

ఇటీవల ముగిసిన 2022ఆసియా కప్‌ టోర్నీలో సూపర్ 4దశలోనే భారత్ పరాజయం పాలయి ఇంటికొచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో అర్ష్‌దీప్ సింగ్ డెత్ ఓవర్లలో ఆకట్టుకున్నాడు. అయితే అతని ప్రదర్శన కనుమరగయింది అందుకు కారణం ఉంది. తను పాకిస్తాన్‌పై సూపర్ 4 మ్యాచ్‌లో కీలక క్యాచ్ డ్రాప్ చేశాడు. కీలక సమయంలో అర్ష క్యాచ్ మిస్ చేయడం అది కూడా సులువైంది కావడంతో భారత్ మ్యాచ్ మిస్సయింది. ఈ క్యాచ్ అనంతరం అర్షదీప్ పట్ల విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

ఇక అతని కోచ్ జస్వంత్ రాయ్ ఈ విషయమై మాట్లాడుతూ.. క్యాచ్ మిస్ పట్ల అర్షదీప్ తీవ్ర నిరాశకు గురయ్యాడని, అతని తప్పిదం వల్ల అతను రాత్రంత నిద్రపోలేకపోయాడని వెల్లడించాడు.
18వ ఓవర్లో క్యాచ్ మిస్ చేసినప్పటికీ చివరి ఓవర్లో 7పరుగులు డిఫెండ్ చేయాల్సిన తరుణంలో అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ ఓ బౌండరీ రావడంతో ఇండియా మ్యాచ్ చేజారింది. 'ఆ రోజు అందరి ఆటగాళ్లలాగే అర్ష్‌దీప్ కూడా కొంచెం టెన్షన్‌గా ఉన్నాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడూ ఓ స్థాయి టెన్షన్ ఉంటుంది. అయితే అతను క్యాచ్ మిస్ చేసినప్పటికీ.. చివరి ఓవర్లో పరుగులు రాకుండా అన్ని ప్రయత్నాలు చేశావని, చింతించాల్సిన అవసరం లేదని మేం అతనికి చెప్పాం. నేను తర్వాత అతనితో మాట్లాడాను. అతను ఆ రాత్రి నిద్రపోలేనని చెప్పాడు' అని రాయ్ పేర్కొన్నాడు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి అర్షదీప్ పట్టించుకోలేదని కానీ చివరి ఓవర్‌లో యార్కర్లను సరిగ్గా ఎక్సిక్యూట్ చేయకపోవడం పట్ల నిరాశ చెందాడని కూడా వెల్లడించాడు. ఆట పట్ల నిరంతరం పాజిటివ్ ఇంటెంట్ కనబరిచే అర్షదీప్ టీ20 ప్రపంచకప్‌‌కు ఎంపికవ్వడం జట్టులో భాగంగా ఉండడం భారత జట్టుకు ఎంతో మేలు చేస్తుందని రాయ్ పేర్కొన్నాడు. అర్ష్‌దీప్ తన తప్పులను సరిదిద్దుకునే వైఖరి అతనితో పాటు తప్పకుండా టీమిండియాకు కూడా చాలా మంచి చేస్తుందన్నాడు.

Story first published: Wednesday, September 14, 2022, 14:43 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X