న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ గెలిపించిన అర్జున్ టెండూల్కర్

Arjun Tendulkar stars for Mumbai U-19 with five wicket-haul against Gujarat U-19

న్యూ ఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్ ఆదివారం జరిగిన వినూ మాంకడ్‌ ట్రోఫీ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే, తన తండ్రిలా బ్యాటింగ్‌లో కాకుండా బౌలింగ్‌లో సత్తా చాటాడు. ఇప్పటికే శ్రీలంకలో జరిగిన అండర్‌-19 క్రికెట్‌ కప్‌లో అద్భుతంగా రాణించి, మంచి పేరు తెచ్చుకున్న అర్జున్.. ‌వినూ మాంకడ్‌ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు.

50 బంతులు వేసిన అర్జున్‌ టెండూల్కర్..

50 బంతులు వేసిన అర్జున్‌ టెండూల్కర్..

ముంబై తరఫున ఆడుతున్న అతను.. గుజరాత్‌తో జరిగిన వన్డే మ్యాచులో తన లెఫ్ట్‌ హ్యాండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌తో కేవలం 30 పరుగులు ఇచ్చి, 5 వికెట్లు తీసి తమ జట్టుని 9 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. మొత్తం 50 బంతులు వేసిన అర్జున్‌ టెండూల్కర్.. గుజరాత్‌ బ్యాట్స్‌మెన్‌ దత్తేశ్‌ షా (0), ప్రియేశ్‌ (1), ఎల్‌ఎమ్‌ కొచ్చెర్‌ (8), జయ్‌మీత్ పటేల్‌ (26), ధ్రువంగ్ పటేల్‌ (6)ల వికెట్లను పడగొట్టాడు.

జట్టు సునాయాసంగా విజయం సాధించడానికి

జట్టు సునాయాసంగా విజయం సాధించడానికి

గుజరాత్‌ని ముంబై 49.2 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్‌ చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు సురేన్‌ పర్కార్‌ 67 (నాటౌట్‌), దివ్యాంచ్‌ 45 పరుగులు చేసి తమ జట్టు సునాయాసంగా విజయం సాధించడానికి దోహదపడ్డారు. దీంతో 38 ఓవర్లలో ముంబై లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ట్రోఫీలో ముంబై తన తదుపరి మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యప్రదేశ్‌లో మంగళవారం జరగనుంది. ‌

అండర్ 19జట్టులో ఆడేందుకు చివరి ఏడాది

అండర్ 19జట్టులో ఆడేందుకు చివరి ఏడాది

వచ్చే ఏడాది 20ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న అర్జున్ టెండూల్కర్‌కు అండర్ 19జట్టులో ఆడేందుకు ఇదే చివరి సంవత్సరం. ఈ కారణంతోనే అర్జున్ వచ్చే ఏడాది జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆడేందుకు అవకాశం కోల్పోయాడు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సెలక్టర్లు అతణ్ని వన్డే జట్టులోకి తీసుకోలేదు. జూలై నెలలో అర్జున్ రెండు యూత్ టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ సీనియర్లతో కలిసి స్టేట్ లెవల్ క్రికెట్‌లో ఆడుతున్నాడు.

టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు:

టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు:

అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లోని మిడిల్ సెక్స్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అర్జున్.. బంతిని అందించేందుకు సిక్సు బౌండరీ దగ్గర బాల్ బాయ్‌గానూ వ్యవహరించాడు.

Story first published: Monday, October 8, 2018, 14:56 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X