న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌ టెస్టు జట్టులో జోఫ్రా ఆర్చర్: వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్

Archer called up for Ashes, Stokes named England vice-captain

హైదరాబాద్: ఇంగ్లాండ్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇంతవరకు ఒక్క టెస్టు కూడా ఆడని జోఫ్రా ఆర్చర్ నేరుగా ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌కు ఎంపికవడం విశేషం. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆగస్టు 1న ప్రారంభమయ్యే యాషెస్ తొలి టెస్టు కోసం 14 మంది సభ్యుల జట్టును ఇంగ్లాండ్‌ సెలక్టర్లు శనివారం ప్రకటించారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్

వైస్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్

ఈ జట్టుకు జో రూట్‌ కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా... ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు మళ్లీ వైస్‌ కెప్టెన్సీ లభించింది. 2017 సెప్టెంబర్‌లో బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో గొడవ కారణంగా వైస్ కెప్టెన్ స్థానాన్ని బెన్ స్టోక్స్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గొడవలో స్టోక్స్‌కు క్లీన్‌చిట్ రావడం, నిలకడగా రాణిస్తుండడంతో మరోసారి నియమితుడయ్యాడు.

జట్టులో చోటు దక్కించుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

జట్టులో చోటు దక్కించుకున్న జేమ్స్‌ ఆండర్సన్‌

గాయంతో ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు దూరమైన సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ కూడా జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 92 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన లీచ్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌ ఆగస్టు 1న ఆరంభమవుతుంది.

యాషెస్ సిరిస్‌కు ఇంగ్లండ్ జట్టు :

యాషెస్ సిరిస్‌కు ఇంగ్లండ్ జట్టు :

జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కరన్, జో జెన్లీ, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, ఒల్లీ స్టోన్స్, క్రిస్ వోక్స్.

Story first published: Sunday, July 28, 2019, 9:50 [IST]
Other articles published on Jul 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X