న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 6 సిక్సర్లు: యువరాజ్ రికార్డు సమం, హజ్రతుల్లా రికార్డు

 APL 2018: Hazratullah Zazai hits six 6s in an over

హైదరాబాద్: షార్జా వేదికగా జరుగుతున్న ఆప్ఘనిస్థాన్ ప్రిమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) టీ20 క్రికెట్ టోర్నీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బల్ఖ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాబుల్‌ జ్వానన్‌ జట్టు బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్‌ ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు బాదాడు. తద్వారా ఒక ఓవర్‌లో 37 పరుగులు సాధించాడు.

17 బంతుల్లో 62 పరుగులు

ఈ క్రమంలో హజ్రతుల్లా జజాయ్‌ 17 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. దీంతో టీ20ల్లో టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉన్న వేగవంతమైన హాఫ్ సెంచరీ(12 బంతుల్లో హాఫ్ సెంచరీ) రికార్డుని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బల్ఖ్‌ లెజెండ్స్‌ బౌలర్ మజారి బౌలింగ్‌లో అతడు ఆరు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో హజ్రతుల్లా జజాయ్‌

17 బంతుల్లో 62 పరుగులు

ఈ క్రమంలో హజ్రతుల్లా జజాయ్‌ 17 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. దీంతో టీ20ల్లో టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉన్న వేగవంతమైన హాఫ్ సెంచరీ(12 బంతుల్లో హాఫ్ సెంచరీ) రికార్డుని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బల్ఖ్‌ లెజెండ్స్‌ బౌలర్ మజారి బౌలింగ్‌లో అతడు ఆరు సిక్సర్లు బాదాడు.

ఆరు బంతుల్లో ఆరు పరుగులు

ఆరు బంతుల్లో ఆరు పరుగులు

అబ్దుల్లా మజారి వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో హజ్రతుల్లా జజాయ్‌ వరుసగా(6, 6, వైడ్, 6, 6, 6, 6) రెచ్చిపోవడంతో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో హజ్రతుల్లా జజాయ్‌ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో యువరాజ్‌ (2007లో ఇంగ్లాండ్‌పై), క్రిస్‌ గేల్‌ (2016 బిగ్‌బాష్‌ లీగ్‌లో) కూడా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు.

నలుగురు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో

నలుగురు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్‌లో

గారీఫీల్డ్‌ సోబర్స్‌, రవిశాస్త్రి, గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌ మాత్రమే క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ కాబుల్‌ జ్వానన్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బల్ఖ్‌ లెజెండ్స్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది.

అరుదైన రికార్డు నెలకొల్పిన బల్ఖ్‌ లెజెండ్స్‌ జట్టు

అరుదైన రికార్డు నెలకొల్పిన బల్ఖ్‌ లెజెండ్స్‌ జట్టు

క్రిస్‌ గేల్‌ (80) విజృంభించాడు. ఈ క్రమంలో బల్ఖ్‌ లెజెండ్స్‌ అరుదైన రికార్డుని నెలకొల్పింది. బల్ఖ్‌ లెజెండ్స్‌ 23 సిక్స్‌లు బాది ఓ టి20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. 21 సిక్స్‌లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (2013లో), వెస్టిండీస్‌ (2016లో), రంగ్‌పూర్‌ రైడర్స్‌ (2017లో), భారత్‌ (2017లో) పేరిట ఉన్న రికార్డును బల్ఖ్‌ లెజెండ్స్‌ బద్దలు కొట్టింది. అనంతరం కాబుల్‌ జ్వానన్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Monday, October 15, 2018, 14:36 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X