న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘Any changes in CSK team?’: నెటిజన్లను ఆకట్టుకుంటోన్న సీఎస్‌కే ఫ్రాంచైజీ సమాధానం

‘Any changes in CSK team?’ – A fan questions Chennai franchise; gets a perfect response


హైదరాబాద్:
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల పాటు ఈ క్యాష్ రిచ్ టోర్నీకి దూరమైంది. అనంతరం నిర్వహించిన వేలంలో అనుభవం కలిగిన సీనియర్ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది.

జట్టులోని పది మందికిపైగా ముఫ్పై ఏళ్లకు పైబడిన వారే కావడంతో చెన్నై సూపర్ కింగ్స్‌ను అభిమానులు ముద్దుగా 'డాడీస్ ఆర్మీ' అని పిలువడం మొదలుపెట్టారు. సీఎస్‌కేకు సంబంధించిన అన్ని విషయాలను యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పంచుకునేది. తాజాగా, ఓ అభిమాని ట్విటర్లో అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే ఫ్రాంచైజీ సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.

Kohli, Anushka reveals funny facts: 'కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే చాలా ఇష్టం'Kohli, Anushka reveals funny facts: 'కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే చాలా ఇష్టం'

ఐపీఎల్ 2020 సీజన్ కోసం ట్రేడింగ్‌ విండో ఆరంభమైంది. లీగ్‌లోని మిగతా జట్ల నుంచి ఆటగాళ్లను పొందాలనుకునే ఫ్రాంచైజీలు ట్రేడింగ్ ద్వారా వారిని సొంతం చేసుకోవచ్చు. ట్రేడింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్‌ 19న కోల్‌కతాలో వచ్చే సీజన్ కోసం ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని "సీఎస్‌కే జట్టులో ఏమైనా మార్పులున్నాయా?" అని ట్విటర్లో ప్రశ్నించాడు.

ఈ ట్వీట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం "అవును, డాడీస్‌ ఆర్మీ వయసు మరో ఏడాది పెరిగింది" అంటూ సరదాగా సమాధానమిచ్చింది. ఈ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ పైనల్‌కు చేరినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.

సహనాన్ని కోల్పోయిన రోహిత్.. థర్డ్‌ అంపైర్‌పై అసభ్య పదజాలం (వీడియో)!!సహనాన్ని కోల్పోయిన రోహిత్.. థర్డ్‌ అంపైర్‌పై అసభ్య పదజాలం (వీడియో)!!

Story first published: Friday, November 8, 2019, 18:09 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X