న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌లో భారత జట్టు ఔటింగ్‌.. అనుష్కతో సైనీ, షమీ!!

Anushka Sharma Joins Virat Kohli And His Teammates On A Trip To Putaruru

వెల్లింగ్టన్: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను పూర్తి చేసింది. ఇక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా విహార యాత్రకు వెళ్లింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు దొరికిన విరామ సమయాన్ని ఆటగాళ్లు చక్కగా వినియోగించుకుంటున్నారు. ప్రకృతి అందాల వీక్షణలో మునిగితేలుతున్నారు.

మరోసారి ఓపెనర్లు విఫలం.. పృథ్వీ షా డకౌట్.. మయాంక్‌ 1.. భారత్‌కు సవాలే!!మరోసారి ఓపెనర్లు విఫలం.. పృథ్వీ షా డకౌట్.. మయాంక్‌ 1.. భారత్‌కు సవాలే!!

విరుష్కతో సైనీ, షమీ:

గురువారం జట్టు సభ్యులు న్యూజిలాండ్‌లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సందడి చేశాడు. పుటుటురులోని బ్రూస్ప్రింగ్స్‌ను క్రికెటర్లు సందర్శించారు. సీనియర్ పేసర్‌ మహ్మద్‌ షమీ, జూనియర్ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీలు విరుష్కలతో కలిసి ఎంజాయ్ చేశారు. విరుష్కలతో కలిసి దిగిన ఫొటోలను పేసర్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

భారత జట్టు ఔటింగ్‌:

భారత జట్టు ఔటింగ్‌:

భారత మిగతా ఆటగాళ్లు కూడా బ్రూస్ప్రింగ్స్‌ ప్రాంతానికే విహారానికి వెళ్లినట్లు బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో ఫొటోలను పంచుకుంది. ప్రకృతి రమణీయమైన బ్లూస్ప్రింగ్స్‌ ప్రాంతంలో సరదాగా వాకింగ్‌కు వెళ్లినట్లు తెలిపింది. బీసీసీఐ పంచుకున్న ఫొటోల్లో కోహ్లీ, షమీ కనిపించలేదు. ఇక షమీ పోస్టు చేసిన ఫొటోలో ఇతర భారత ఆటగాళ్లు కనిపించలేదు. అయితే సైనీ మాత్రం సేమ్ టీ-షర్ట్ వేసుకుని బీసీసీఐ, షమీ పోస్టు చేసిన ఫొటోలలో కనిపించాడు. అంటే అంతా కలిసి ఒక బృందంగా వెళ్లినట్టు అర్ధమవుతోంది.

జడేజా ఇంటర్వ్యూ:

బీసీసీఐ పోస్టు చేసిన ఫొటోల్లో వృద్ధిమాన్ సాహా, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ తదితరులు కనిపించారు. మరో ఫొటోలో రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్‌గిల్, పృథ్వీ షాలు కూడా ఉన్నారు. ఇక రవీంద్ర జడేజా సహచర ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, పృథ్వీ షాలను ఇంటర్వ్యూ చేసాడు. షాను ఇంటర్వ్యూ చేసే సమయంలో ఏమైందో తెలియదు కానీ అందరూ నవ్వుకున్నారు.

టీమిండియాపై విమర్శలు:

టీమిండియాపై విమర్శలు:

ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌ గెలవాలంటే భారత్‌ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాలి. 21 నుంచి తొలి టెస్టు, 29 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్నాయి. ఓపెనర్ రోహిత్‌ శర్మ గాయం కావడంతో.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు జోడీగా ఎవరొస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

Story first published: Friday, February 14, 2020, 10:53 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X