క్రికెట్ నేర్చుకోడానికి రాజీ లేని ప్రయత్నాలకు సిద్ధమైన అనుష్క శర్మ.. ఇంగ్లాండ్లో కఠోర ప్రాక్టీస్

నటన పట్ల అంకిత భావానికి, అందానికి పేరుగాంచిన అనుష్క శర్మ ఇప్పుడు తన క్రికెట్ నైపుణ్యాన్ని పదును పెట్టడానికి కఠోర శిక్షణకు సిద్ధమయింది. తన రాబోయే చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్‌'లో భారత లెజెండరీ మహిళ పేసర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించడానికి ఆమె క్రికెట్ శిక్షణ తీసుకోనుంది.. ఆగస్టు నెలాఖరులో షూటింగ్ ప్రారంభం కానున్నందున ఈ 34ఏళ్ల బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ లీడ్స్‌కు మరో రెండు మూడు రోజుల్లో వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ పూర్తయింది.

క్రికెట్ షూటింగ్ పార్ట్ మిగిలి ఉంది. అది సినిమాకు చాలా కీలకం. అందువల్ల సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే క్రికెట్ షూటింగ్ పార్ట్ కోసం ముందుగానే ఓ 20రోజుల పాటు శిక్షణ తీసుకోనుంది. ఇటు కూతురు వామికాకు, అటు భర్త విరాట్‌ కోహ్లీకి ఆమె కొన్నాళ్లపాటు సమయం వెచ్చించకపోవచ్చు.

ఝలన్‌గా మారిపోవడానికి అనుష్క అన్ని ప్రయత్నాలు చేస్తోంది

ఝలన్‌గా మారిపోవడానికి అనుష్క అన్ని ప్రయత్నాలు చేస్తోంది

ఈ మూవీ ప్రొడక్షన్‌‌కు సంబంధించిన ఓ వ్యక్తి అనుష్క శిక్షణ గురించి మాట్లాడాడు. 'అనుష్క తెరపై ఝులన్‌గా మారడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఆమె అందుకు తగ్గట్లు తన శరీరాన్ని సిద్ధం చేస్తోంది. ఆమె సినిమాలో క్రికెట్ పార్ట్ చిత్రీకరించడానికి ముందు లీడ్స్‌లో తన క్రికెట్ నైపుణ్యాలను పెంచుకునేందుకు కసరత్తులు చేయబోతుంది.

జనవరి నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. నిర్మాతలు కాస్త లేటుగా రిలీజ్ చేసే అవకాశముంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అనుష్క ఎంతో నిబద్ధత కలిగిన కళాకారిణి. ఆమె తన పాత్రకు న్యాయం చేయాలని తపిస్తోంది. ఆమె ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ముందు ఆమె పూర్తిగా ప్రిపేర్ అవుతుంది.' అని పేర్కొన్నాడు.

281 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఝలన్ గోస్వామి

281 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఝలన్ గోస్వామి

ఇక ఝలన్ గోస్వామి విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 39ఏళ్ల గోస్వామి ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌లో ఓ లెజెండ్. ఆమె 281అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 352వికెట్లు తీసింది. గోస్వామి 2007లో ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించింది. 2008లో ఆమె భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించింది.

సినిమా పరంగా బాగున్నా.. మరీ ఫలితం ఎలా ఉంటుందో..?

సినిమా పరంగా బాగున్నా.. మరీ ఫలితం ఎలా ఉంటుందో..?

ఇక బయోపిక్‌ల విషయానికొస్తే.. ఎంఎస్ ధోని బయోపిక్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీలా మారిపోయి నటించిన విధానం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

అదేవిధంగా '83'లో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్‌గా నటించి మెప్పించాడు. ఆ చిత్రం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇకపోతే తాప్సీ పన్ను మిథాలీరాజ్‌గా నటించిన చిత్రం శభాష్ మిథు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. ఈ చిత్రానికి మిశ్రమ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మరో మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్లో అనుష్క శర్మ నటించనుండడంతో ఆమెపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సినిమా పరంగా ఎంత బాగున్నా.. ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందనేది కాస్త సంకోచించాల్సిన విషయం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Read more about: anushka sharma jhulan goswami
Story first published: Friday, August 5, 2022, 21:08 [IST]
Other articles published on Aug 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X