పంజాబ్‌తో మ్యాచ్: కోహ్లీకి ఫ్లయింగ్ కిస్ పెట్టిన అనుష్క శర్మ

Posted By:
Anushka Sharma blows a flying kiss to Virat Kohli during Indian Premier League

హైదరాబాద్: సొంతగడ్డపై సమిష్టి ప్రదర్శనతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం కింగ్స్‌ఎల్‌వన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, భాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

శుక్రవారం బెంగళూరు-పంజాబ్‌ జట్ల మధ్య చిన్నస్వామి స్డేడియంలో జరిగిన మ్యాచ్‌కు అనుష్క శర్మ హాజరైంది. ఈ సందర్భంగా అనుష్క శర్మ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ అసాంతం బెంగళూరు జట్టుకు తన మద్దుతు తెలపుతూ, కెప్టెన్ కోహ్లీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. మైదానంలో బెంగళూరు జట్టు ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో కోహ్లీ కోసం అనుష్క శర్మ ఫ్లయింగ్‌ కిస్ కూడా పంపించింది.

క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఆండ్రూ టై ఇచ్చిన క్యాచ్‌ని విరాట్ కోహ్లీ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి బెంగళూరు బోణీ కొట్టింది.

బెంగళూరు మ్యాచ్‌లకు అనుష్క హాజరవ్వడం పరిపాటే

బెంగళూరు మ్యాచ్‌లకు అనుష్క హాజరవ్వడం పరిపాటే

గతంలోనూ ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియంలోని స్టాండ్స్‌లో అనుష్క దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. బెంగళూరు జట్టును, ముఖ్యంగా కోహ్లీని ఉత్సాహపరిచేందుకు అనుష్క శర్మ ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతుంటుంది. కాగా, శుక్రవారం మ్యాచ్‌ని అనుష్క శర్మ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింతాతో కలిసి వీక్షించింది.

బెంగళూరు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్

బెంగళూరు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్

ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు తొలి ఓవర్‌లో మెకల్లమ్‌ డకౌట్‌తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, మరో ఓపెనర్‌ డికాక్‌తో కలసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

ముజీబ్ రెహ్మాన్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్

ముజీబ్ రెహ్మాన్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డ్

ఈ తరుణంలో కోహ్లీ (21) యువ స్పిన్నర్ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ అద్భుత బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌, అప్పటికే జోరు మీదున్న డికాక్‌తో కలిసి నెమ్మదిగా స్కోరుబోర్డుని పరిగెత్తించాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన అశ్విన్‌ వరుస బంతుల్లో డికాక్‌(45), సర్ఫరాజ్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

వరుస సిక్సర్లతో చెలరేగిన డివిలియర్స్

వరుస సిక్సర్లతో చెలరేగిన డివిలియర్స్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మన్దీప్ సింగ్‌తో కలసి డివిలియర్స్‌ వరుస సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన డివిలియర్స్‌(57) బౌండరీ లైన్‌ వద్ద కరుణ్‌ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

చివరి ఓవర్లో సుందర్‌ ఫోర్‌ కొట్టడంతో బెంగళూరు విజయం

చివరి ఓవర్లో సుందర్‌ ఫోర్‌ కొట్టడంతో బెంగళూరు విజయం

అదే ఓవర్ నాలుగో బంతికి మన్‌దీప్‌ కూడా రనౌటయ్యాడు. దీంతో అభిమానుల్లో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, చేధించాల్సిన పరుగులు తక్కువగా ఉండటం చివరి ఓవర్లో సుందర్‌ ఫోర్‌ కొట్టడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా, అక్షర పటేల్, ముజీబ్, ఆండ్రు టై తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 155 పరుగులకే ఆలౌటైంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, April 14, 2018, 11:47 [IST]
Other articles published on Apr 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి