న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా జట్టుకు మద్దతుగా అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు

Anil Kumble backs Australia to make it to the semi-final of the World Cup 2019

హైదరాబాద్: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బలమైన జట్టుగా మారిందని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. దీంతో పాటు ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా సెమీపైనల్ వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పుకొచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా జట్టుని ప్రపంచ క్రికెట్‌ ముందు దోషిగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం కూడా విధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆడిన పలు టోర్నీలో పేలవ ప్రదర్శన చేసింది.

ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్

ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్

ముఖ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఐదు వన్డేల సిరిస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న ఆస్ట్రేలియా భారత్‌ను సొంతగడ్డపై ఓడించడంతో పాటు యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరిస్‌లను కైవసం చేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

మే30 నుంచి వరల్డ్‌కప్

మే30 నుంచి వరల్డ్‌కప్

వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వన్డేల్లో విజయం సాధించడం ఆ జట్టులోని ఆటగాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. మే30 నుంచి ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అనిల్ కుంబ్లే క్రికెట్ నెక్ట్స్‌తో మాట్లాడుతూ గత ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేశాడు.

లియాన్, జంపాలే కీలకం

లియాన్, జంపాలే కీలకం

ఆస్ట్రేలియా విజయాల్లో స్పిన్నర్లు నాథన్ లియాన్, ఆడమ్ జంపాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కుంబ్లే చెప్పాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వీరి పాత్ర ఎంతో కీలకం కానుంది. కుంబ్లే మాట్లాడుతూ "వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఆసీస్ ఎప్పుడూ మంచి ప్రదర్శనే చేసింది. ఇంగ్లాండ్‌లో పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంది" అని చెప్పాడు.

సెమీస్ వరకు వెళుతుంది

సెమీస్ వరకు వెళుతుంది

"దీంతో ఈ వరల్డ్‌కప్‌లో వారు రాణించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సక్సెస్‌ని అందుకుంది. వరల్డ్‌కప్ లాంటి టోర్నీ ఆ జట్టుకు ఎంత ముఖ్యమో తెలుసు. ఆ జట్టు తప్పకుండా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది" అని కుంబ్లే చెప్పాడు. వరల్డ్‌కప్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టుకు ఆరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి మ్యాచ్‌ని జూన్ 1వ తేదీన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. అంతకముందు ఇంగ్లాండ్, శ్రీలంక జట్లతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Friday, May 17, 2019, 18:56 [IST]
Other articles published on May 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X