న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టీ20ల సిరిస్ నుంచి మాథ్యూస్ ఔట్

By Nageshwara Rao
Angelo Mathews ruled out of T20I series vs Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ముందు శ్రీలంక జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ రెండు టీ20ల సిరిస్‌కు దూరమయ్యాడు. 30 ఏళ్ల మాథ్యూస్ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మోకాలు గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే.

దీని కారణంగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు భారత పర్యటనకు మాథ్యూస్ దూరమయ్యాడు. తాజాగా ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగనునన టీ20 సిరిస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు మాథ్యూస్ ఫిట్‌గా ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.

అయితే, మార్చిలో బంగ్లాదేశ్, ఇండియా, భారత్ జట్ల మధ్య నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌ జరగనుండటంతో బంగ్లా టీ20 సిరిస్ నుంచి తప్పుకున్నాడు. ఆరు నెలల క్రితమే మాథ్యూస్ మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ... లంక క్రికెట్ బోర్డు తిరిగి మాథ్యూస్‌నే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

శ్రీలంక కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ మాథ్యూస్‌కేశ్రీలంక కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ మాథ్యూస్‌కే

ఇక, టెస్టుల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా దినేశ్ చండీమాల్ వ్యవహారిస్తోన్నాడు. మాథ్యూస్‌కు ముందు వరకు వన్డే కెప్టెన్‌గా ఉన్న ఉపుల్ తరంగ ఇటీవల భారత పర్యటనలో శ్రీలంక 5-0తో వైట్ వాష్‌కు గురవడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టు ఫిబ్రవరి 8న ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ అనంతరం ఫిబ్రవరి 15, 18 తేదీల్లో ఇరు జట్ల మధ్య రెండు టీ20ల సిరిస్ జరగనుంది. ఇది ముగిసిన తర్వాత మార్చి 8న శ్రీలంక వేదికగా నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌ జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 17:34 [IST]
Other articles published on Feb 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X