ఐపీఎల్ క్రికెట్‌లో ఫుట్‌బాల్ ఆడిన (పంజాబ్) ఆండ్రూ

Posted By:
Andrew Tyes football skills at the ropes

హైదరాబాద్: బ్యాటింగ్‌తోనే కాదు ఫీల్డింగ్‌తోనూ మెరిపిస్తుంటారు క్రికెటర్లు. బాల్ ను ఆపే ప్రయత్నంలో వాళ్లు చేసే అద్భుతాలు ఆశ్చర్యం తెప్పించేలా ఉంటాయి. ఒక్కోసారి మన కళ్లు నమ్మలేని విధంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లు బంతులను అందుకుంటూ ఉంటారు. తాజాగా ఆదివారం అలాంటి ఘటనే ఐపీఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది.

ఆండ్రూ టై బంతిని ఇలా ఆపాడు

కొద్దిగలో తన కష్టం వృథా కాకుండా మరొక క్రికెటర్ రావడంతో పంజాబ్ జట్టు ఆండ్రూ టై చేసిన విన్యాసం సఫలీకృతమైంది. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్.. ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు.

అసలేం జరిగిందంటే:
అది తొలి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్. క్రీజులో క్రిష్టియన్, మోరిస్ ఉన్నారు. మోహిత్ శర్మ బౌలింగ్ చేస్తున్న ఆ ఓవర్‌లో ఐదో బంతిని మోరిస్ బలంగా బౌండరీకి దిశగా బాదాడు. బౌండరీ లైన్ రోప్ దగ్గరగా వెళ్లిన బంతికి అడ్డుగా ఆండ్రూ టై మెరుపులా దూసుకొచ్చాడు. డైవ్ చేస్తూ బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఆ బంతి మొదట కుడి కాలికి తగిలి రెండు కాళ్ల మధ్యలో నుంచి వెళ్తూ మళ్లీ ఎడమ కాలికి తగిలి బౌండరీ లైన్‌కు తరలి కాస్తలో ఉండగా ఆగిపోయింది. ఫోర్ బౌండరీ ఒకటి వెళ్లకుండా చేయగలిగాడు ఆండ్రూ టై. తన చేతులతో పట్టుకోకుండానే ఫుట్‌బాల్ స్కిల్స్‌ని ఇక్కడ ఉపయోగించాడన్న మాట.

ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఐపీఎల్ 2018 సీజన్‌లో పంజాబ్ బోణీ కొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ చేసిన హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైనది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 13:00 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి