న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సైమండ్స్ మృతదేహం వద్ద అతని పెంపుడు కుక్క చేసిన పనికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి

Andrew Symonds Pet Dog Crying Looking At His Dead Body

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ ఆదివారం క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే ఏరియా శివారులో కారు యాక్సిడెంట్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు కారు యాక్సిడెంట్లో త్రుటిలో బతికి బయటపడ్డాయి. ఇక అందులో ఓ పెంపుడు కుక్క చేసిన పనిని ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ మీడియాతో తెలిపింది.

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సదరు మహిళ మాట్లాడుతూ.. 'నా భర్త ఆ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే వెళ్లి సైమండ్స్‌ను బతికించడానికి తన ప్రయత్నం చేశాడు. కానీ సైమండ్స్ స్పాట్లోనే చనిపోయారు. అతని పల్స్ అప్పటికే ఆడిపోయింది. సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు అతనితో పాటు కారులో ఉన్నాయి. అవి కూడా చనిపోయే ఉండొచ్చనుకున్నాం. కానీ అవి త్రుటిలో సజీవంగా బయటపడ్డాయి.

ఇక అందులో ఓ పెంపుడు కుక్క మాత్రం సైమండ్స్ మృతదేహాన్ని అస్సలు విడిచిపెట్టడానికి సిద్ధం కాలేదు. అక్కడక్కడే తిరుగుతూ, మొరుగుతూ హృదయ విదారకంగా రోదించింది. దాని ప్రేలాపన చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేము సైమండ్స్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారీ మా మీదకు అరిచింది. అతన్ని మృతదేహాన్ని స్థానికుల సహాయంతో అక్కడి నుంచి హాస్పిటల్ తరలించేందుకు ప్రయత్నిస్తుంటే బాగా మొరిగింది' అని పేర్కొంది.

ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో సైమండ్స్ ఒకడు. జట్టుకు అన్ని విభాగాల్లో కీలక ఆటగాడిగా ఉంటూ తాను ఆడే రోజుల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమండ్స్ 1998లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అతను 26 టెస్ట్ మ్యాచ్‌లు, 198 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. అలాగే 165 వికెట్లు, 6887పరుగులు చేశాడు. 2003, 2007లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలుపొందిన జట్టులో ఆల్రౌండర్‌గా ఉన్నాడు.

Story first published: Monday, May 16, 2022, 12:54 [IST]
Other articles published on May 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X