అమ్మాయిల పిచ్చిలో చేసిన తప్పిదం నన్ను వెంటాడుతోంది : ఆండ్రూ రసెల్

ఆంటిగ్వా : అమ్మాయిల పిచ్చి, లైంగిక వాంఛతో చెసిన తప్పిదం తనను ఇప్పటికీ వెంటాడుతోందని వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రూ రసెల్ తెలిపాడు. సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ పవర్ హిట్టర్.. ఎలాంటి బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించగలడు. వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం దాదాపు మానేసిన రసెల్ వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్స్ మాత్రం ఆడుతున్నాడు. కానీ.. మోకాలి గాయం కారణంగా ప్రతి టోర్నీలోనూ అతను ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కు ఆడిన రసెల్.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌ల్ని సైతం అలవోకగా గెలిపించాడు. కానీ.. బౌలింగ్‌లో మాత్రం బంతి విసిరిన తర్వాత అదుపు తప్పి పిచ్‌పై తరచూ పడిపోతుండేవాడు.

ప్రతీ సిరీస్‌లో బుమ్రా రాణించాలంటే ఎలా? : మాజీ పేసర్

ఏడేళ్ల క్రితం చేసిన తప్పు..

ఏడేళ్ల క్రితం చేసిన తప్పు..

ఏడేళ్ల క్రితం తనకున్న అమ్మాయిల పిచ్చి, లైంగిక వాంఛతో తన మొకాలి గాయాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు అది పెద్ద సమస్యగా మారి తనను వేధిస్తొందని గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కరేబియర్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

‘నా తరహాలో శరీర సౌష్టవం కావాలని ఆశపడే వారు.. నేను చేసిన తప్పు మాత్రం చేయొద్దు. నాకు 23-24 ఏళ్ల వయసులో చిన్నగా మోకాలి నొప్పి వచ్చింది. అప్పట్లో నేను దాన్ని పట్టించుకోలేదు. కేవలం భుజం, ఛాతి పెద్దగా కనిపించేందుకు మాత్రమే ఎక్కువగా జిమ్‌లో కష్టపడేవాడ్ని. ఆ వయసులో అమ్మాయిలకి సెక్సీగా కనిపించాలనే తాపత్రయం నాలో ఉండేది' అని రసెల్ తెలిపాడు..

ఇప్పుడు తెలుసొస్తోంది..

ఇప్పుడు తెలుసొస్తోంది..

ఆ వయసులోనే కాళ్లకు కూడా ఎక్సర్‌సైజ్‌లు చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుందని ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ అభిప్రాయపడ్డాడు. ‘అప్పట్లో కాళ్లకి కూడా చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లు చేసి పటిష్టంగా ఉంచుకుని ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. మ్యాచ్ ఆడే సమయంలో మొకాలి నొప్పి వస్తే పెయిన్ కిల్లర్‌ వేసుకోవడం, చిన్నపాటి సర్జరీలతో సరిపెట్టాను తప్ప.. ఏ రోజూ వాటిపై నేను శ్రద్ధ వహించలేదు. అయితే.. 30లో పడిన తర్వాత వాటి విలువ నాకు తెలుస్తోంది' అని 31 ఏళ్ల రసెల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

నా శరీరాన్నే మోసే బలం లేనందునే..

నా శరీరాన్నే మోసే బలం లేనందునే..

తన శరీరాన్ని మోసేంత బలం కాళ్లలో లేనందునే బంతిని బలంగా హిట్ చేయలేకపోతున్నానన్నాడు. ‘మోకాళ్లలో నా శరీరాన్ని మోసే బలం లేనందున మ్యాచ్‌ల్లోనూ ఆశించిన విధంగా బంతిని బలంగా హిట్ చేయలేకపోతున్నా. అయితే.. ఫోర్, సిక్స్ కొట్టిన తర్వాత క్రీజులో అయితే నిలబడగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది.' అని రసెల్ తెలిపాడు.

ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో ఈ కొల్‌కతా ప్లేయర్ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే అతను భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో 64 మ్యాచ్‌లాడిన రసెల్ 186.42 స్ట్రైక్‌‌రేట్‌తో 1,400 పరుగులు చేశాడు. ఇందులో 96 ఫోర్లు, 120 సిక్సర్లు ఉన్నాయి. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చే రసెల్.. గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 54 పరుగులు చేసి కోల్‌కతా గెలిపించాడు. టోర్నీకే ఈ మ్యాచ్‌ హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 2016, జూలైలో మోడల్‌ జాసిమ్ లోరాని ఆండ్రీ రసెల్ వివాహం చేసుకోగా.. వీరికి ఇటీవలే ఓ పాప కూడా జన్మించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, February 13, 2020, 20:29 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X