న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2021: ఆండ్రీ రసెల్‌ విధ్వంసం.. 120 పరుగుల తేడాతో జమైకా తైలవాస్‌ భారీ విజయం!!

 Jamaica Tallawahs won by 120 runs vs Saint Lucia

సెయింట్‌ కిట్స్‌: కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021 సీజన్‌లో జమైకా తైలవాస్‌ భారీ విజయం నమోదు చేసింది. శుక్రవారం రాత్రి సెయింట్‌ కిట్స్‌ వేదికగా సెయింట్‌ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా తైలవాస్‌ 120 పరుగుల తేడాతో గెలుపొందింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్‌ లూసియా 17.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. టీమ్ డేవిడ్ (28 బంతులో 56; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే అర్ధ శతకం చేశాడు. జమైకా బౌలర్ మైగెల్ ప్రిటోరియస్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. హాఫ్ సెంచరీ (14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)తో పాటు ఒక వికెట్ పడగొట్టిన ఆండ్రీ రసెల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ఈ మ్యాచులో సెయింట్‌ లూసియా కింగ్స్‌ టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన జమైకా తైలవాస్‌ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు వాల్టన్ (29 బంతులో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్), కెన్నార్ లూయిస్ (21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆపై హైదర్ అలీ (32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (26 బంతులో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడడంతో జమైకా తైలవాస్‌ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దీంతో సెయింట్‌ లూసియా బౌలర్లు చేతులెత్తేశారు.

టాప్-4కు తోడు విండీస్‌ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్‌ (14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 14 బంతులో 50 పరుగులు చేశాడు. ఇది సీపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. టీ20 క్రికెట్‌లో రసెల్‌ 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో 14 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అంతేకాదు ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్‌ చరిత్రలో తన జట్టు జమైకా రెండో అతి భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అందరూ చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సెయింట్‌ లూసియా కింగ్స్‌ బౌలర్లలో ఓబెద్‌ మెక్‌ కాయ్‌ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్‌ ఛేజ్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్‌ లూసియా కింగ్స్‌ 17.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జమైకా తైలవాస్‌ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ బాహుబలి రహకీమ్ కార్న్‌వాల్ (నాలుగు బంతుల్లో 14) మూడు వరుస బంతుల్లో బౌండరీలు బాదినా.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆండ్రీ ఫ్లెచర్ (9), ఫాఫ్ డూప్లెసిస్ (0), రోస్టన్ చేజ్ (11), మార్క్ డెల్ (5), కీమో పాల్ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ సమయంలో వహబ్ రియాజ్ (26) అండతో టీమ్ డేవిడ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే వీరిద్దరూ ఔట్ అవ్వడంతో సెయింట్‌ లూసియా ఓటమి ఖరారు అయింది. జమైకా బౌలర్ మైగెల్ ప్రిటోరియస్ 4 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, August 28, 2021, 0:42 [IST]
Other articles published on Aug 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X