న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా అమ్మానాన్నల కోరిక అదే: ఐపీఎల్‌కు ఎంపికైన తెలుగు కుర్రాడు అయ్యప్ప

Andhra Ranji Player Bandaru Ayyappa Selected For IPL 2019

హైదరాబాద్: బండారు అయ్యప్ప. ఐపీఎల్‌కు ఎంపికైన మరో తెలుగు కుర్రాడు. 2011 నుంచి ఆంధ్రా జట్టు తరఫున రంజీల్లో ఆడుతున్నా అంతగా తెలియని పేరు. అయితే, మంగళవారం జైపూర్ వేదికగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్‌ జట్టు కొనుగోలు చేసింది.

'టిమ్ పైన్-విరాట్ కోహ్లీ మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించింది''టిమ్ పైన్-విరాట్ కోహ్లీ మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించింది'

దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ పేరు హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్ప గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగాడు. తన తండ్రి కోరికను నెరవేర్చడమే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యమని వెల్లడించాడు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన బండారు అయ్యప్ప

నిరుపేద కుటుంబంలో పుట్టిన బండారు అయ్యప్ప

బండారు అయ్యప్ప పూర్తి పేరు బండారు సత్యనారాయణ మూర్తి అయ్యప్ప. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. మండల, జిల్లా స్థాయిలో రాణిస్తూ అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. తాజాగా జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ 2019 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యప్పను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. అయ్యప్ప ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయ్యప్ప తల్లి మీడియాతో

అయ్యప్ప తల్లి మీడియాతో

ఈ సందర్భంగా అయ్యప్ప తల్లి మీడియాతో మాట్లాడుతూనే కంటతడి పెట్టారు. "మా అయ్యప్ప ఆటలాడుతూనే కష్టపడి చదివాడు. క్రికెట్ ఆడుతూ అప్పుడప్పుడు చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ ఇబ్బందులు పడేవాడు. అయితే రోజు నా కొడుకు ఈ స్థాయికి వచ్చాడంటే అతడి శ్రమే కారణం. అయ్యప్పకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అయ్యప్ప ఎదగాలని, భారత్ తరఫున కూడా ఆడాలని దేవుళ్లకు మొక్కేవాళ్లంటూ" అని ఆమె ఆనంద భాష్పాలు రాల్చారు.

చాలా ఆనందంగా ఉంది

చాలా ఆనందంగా ఉంది

ఇక, అయ్యప్ప మాట్లాడుతూ "ఢిల్లీ క్యాపిటల్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. రాజోలు అనే చిన్న గ్రామంలో ఆడాను. రాజా అనే వ్యక్తి నాకు మద్దతిచ్చాడు. ఆయన సహకారంతో జిల్లా స్థాయిలో రాణించాను. ఆపై ఆంధ్రకు రాష్ట్ర స్థాయి, రంజీల్లో మెరుగైన ప్రదర్శన చేశాను. దీంతో ఐపీఎల్ వరకు వెళ్తున్నాను. మా నాన్నగారు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆయన కోరికను నేను నెరవేరుస్తాను" అని అన్నాడు.

ఐపీఎల్‌లో రాణించి భారత్ జట్టుకు ఆడాలని ఉంది

ఐపీఎల్‌లో రాణించి భారత్ జట్టుకు ఆడాలని ఉంది

"ఐపీఎల్‌లో రాణించి భారత్ జట్టుకు ఆడాలని ఉంది. మా అమ్మానాన్నల కోరిక అదే. త్వరలో భారత జట్టులో చోటు దక్కించుకుని వాళ్ల కోరిక నెరవేరుస్తానని" అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, మీడియం పేసర్‌ అయిన బండారు అయ్యప్ప 2018-19 దులీప్‌ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్‌ అయ్యాడు. కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన అయ్యప్ప ఆంధ్ర తరుపున అండర్-16, అండర్-19 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌కు ఢిల్లీ జట్టు:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్, మనోజ్ కార్లా, కొలిన్ మున్రో, క్రిస్ మోర్రిస్, కగిసో రబాడ, సందీప్ లమిచానే, ట్రెంట్ బౌల్ట్

ట్రేడింగ్ ద్వారా జట్టులోకి: శిఖర్ ధావన్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

హనుమ విహారి - Rs 2 crore

అక్షర పటేల్ - Rs 5 crore

ఇషాంత్ శర్మ - Rs 1.10 crore

అంకుష్ బెయాన్స్ - Rs 20 lakh

నాథు సింగ్ - Rs 20 lakh

కొలిన్ ఇంగ్రామ్ - Rs 6.40 crore

రూథర్‌ఫర్డ్ - Rs 2 crore

కీమో పాల్ - Rs 50 lakh

జలజ్ సక్సేనా - Rs 20 lakh

బండారు అయ్యప్ప - Rs 20 lakh

Story first published: Thursday, December 20, 2018, 10:26 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X