న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన్కడింగ్ రనౌట్ ఎఫెక్ట్: అశ్విన్‌ ఫొటోను ముక్కలు చేసిన ఆండర్సన్

Anderson might end up Mankading someone at some point: Ashwin

హైదరాబాద్: ఐపీఎల్‌ మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ రనౌట్ విషయం గురించి తాను పెద్దగా పట్టించుకోవడం లేదని పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. సీజన్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ రనౌట్ చేయడంతో దీనిపై తీవ్రమైన చర్చ జరిగింది. బట్లర్‌ను మన్కడింగ్ రనౌట్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

 అశ్విన్‌కు మద్దతుగా నిలిస్తే

అశ్విన్‌కు మద్దతుగా నిలిస్తే

ఈ విషయంలో పలువురు అశ్విన్‌కు మద్దతుగా నిలిస్తే.... మరికొందరు అశ్విన్‌ తీరుని తీవ్రంగా విమర్శించారు. జోస్ బట్లర్‌ను మన్కడింగ్‌ చేసినందుకు నిరసనగా ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జేమ్స్ అండర్సన్‌, అశ్విన్‌ ఫొటోను ముక్కలు ముక్కలుగా చించేశాడు. ఈ విషయంపై అశ్విన్‌ స్పందిస్తూ మాట్లాడుతూ "నేను చేసింది తప్పని అండర్సన్‌ భావిస్తున్నాడు. రాబోయే రోజుల్లో అతడూ అదే రితిలో ప్రత్యర్థిని ఔట్‌ చేయొచ్చేమో ఎవరికి తెలుసు" అని అశ్విన్ అన్నాడు.

మన్కడింగ్ ఔట్‌ను మనం ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం

మన్కడింగ్ ఔట్‌ను మనం ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం

"మన్కడింగ్ ఔట్‌ను మనం ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం. నేను మాత్రం నిబంధనలను అతిక్రమించి బట్లర్‌ను ఔట్‌ చేయలేదు. మన్కడింగ్‌ రనౌట్ విషయంలో నా జట్టుతో పాటు సీనియర్ ఆటగాళ్లు చాలా మంది అండగా నిలిచారు. ఆ వివాదం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. అది నా ఆటను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు" అని అశ్విన్ అన్నాడు.

 క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శలు

క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శలు

మన్కడింగ్ రనౌట్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో జోస్ బట్లర్ మాట్లాడుతూ "నిబంధనల ప్రకారం మన్కడింగ్‌ తప్పేమీ కాదని నాకు తెలుసు. బౌలర్ బంతి వేయకుండా బ్యాట్స్‌మెన్‌ క్రీజు వదలకూడదు. కానీ నిబంధనలో ఎప్పుడైతే బౌలర్‌ బంతిని చేతుల్లోంచి జారివిడుస్తాడో అని రాసుంది. ఇది అందరినీ తికమకపెడుతోంది" అని అన్నాడు.

నేను క్రీజులోనే ఉన్నా

నేను క్రీజులోనే ఉన్నా

"వీడియో పుటేజీ చూస్తే అశ్విన్‌ బంతి వదలాలి అనుకుంటున్నప్పుడు నేను క్రీజులో ఉన్నట్టు కనిపిస్తుంది. అశ్విన్ అలా మన్కడింగ్‌ చేయడం నచ్చలేదు. నిరాశకు లోనయ్యా. టోర్నీ ఆరంభంలోనే ఇలా జరగడం బాధాకరం. ఏదిఏమైనా క్రికెట్‌ నిబంధనలను పక్కాగా రూపొందించాల్సిన అవసరం ఉంది" అని జోస్ బట్లర్‌ అన్నాడు.

Story first published: Friday, April 5, 2019, 18:33 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X